• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మండపేటలో పాలకేంద్రాలపై విస్తృత తనిఖీలు

E.G: మండపేట పురపాలక సంఘ కమిషనర్ టి.వి.రంగారావు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్రటరీలు మండపేటలోని పాల కేంద్రాలను తనిఖీ చేశారు. మండపేట పట్టణ పరిధిలో ఉన్న 16 పాలకేంద్రాలలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తులు నాణ్యత పరిశీలించి, ఏ విధమైన పాల ఉత్పత్తులు నిల్వ ఉంచరాదని పేర్కొన్నారు.

February 26, 2026 / 07:24 PM IST

మా ప్రభుత్వం తప్పు చేయదు: రేవంత్ రెడ్డి

TG: గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఈ ప్రభుత్వం గ్రూప్ 1,2 ఉద్యోగాలు అమ్ముకుందని కొందరు ప్రచారం చేశారని.. కోర్టుల్లో కేసులు వేశారని వాటన్నింటిని జయించి.. ఇవాళ నియామక పత్రాలు అందించామని అన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేయదని స్పష్టం చేశారు.

February 26, 2026 / 07:23 PM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులను సహించం

NGKL: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించబోమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కుమ్మెర ఘటన బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్‌ జీ.పాటిల్‌తో సమావేశమై కేసు నమోదు ప్రక్రియ, నిందితులపై తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు.

February 26, 2026 / 07:23 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు’

ASR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని టీడీపీ అరకు ఇన్‌ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర హెచ్చరించారు. ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు స్వప్రయోజనాలకు కాకుండా ప్రజల పక్షాన అధికారుల వద్దకు వస్తారని స్పష్టం చేశారు. వారి సమస్యల పట్ల అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

February 26, 2026 / 07:21 PM IST

సింగరేణి గనిలో రేసింగ్ పావురం

BDK: మణుగూరు సింగరేణి గనిలో ట్యాగ్తో కూడిన ఓ రేసింగ్ పావురం పట్టుబడిన చెన్నై పావురాల రేసింగ్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన పోటీలో భాగంగా దీనిని వదిలారు. గమ్య స్థానానికి వెళ్లే క్రమంలో దాహంతో అది మణుగూరు గనిలో దిగగా, సింగరేణి సిబ్బంది దానిని గుర్తించారు. కాలికి ఉన్న ట్యాగ్ ఆధారంగా అది రేసింగ్ పావురమని గుర్తించారు.

February 26, 2026 / 07:20 PM IST

‘బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం’

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శివాజీ నగర్ కు చెందిన చొప్పదండి నరసయ్య (67) ఈనెల 23న మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఇవాళ అతని లివర్, లంగ్స్ దానం చేశారు.

February 26, 2026 / 07:20 PM IST

మంజులాపూర్‌లో కార్టెన్ సర్చ్

NRML: గ్రామాల్లో శాంతి భద్రతలను అందించేందుకే ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏఎస్పి సాయికిరణ్ తెలిపారు. మంజులాపూర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా 56 బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు.

February 26, 2026 / 07:20 PM IST

నాడు ప్రజల పక్షాన.. నేడు జనజీవన స్రవంతిలోకి

BDK: గత ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన నిలబడుతూ ఎన్నో పోరాటాలు చేసి నేడు జనజీవన స్రవంతిలో కలవడం సరైన నిర్ణయమని యువతరం పార్టీ నాయకులు కొనియాడారు. లొంగిపోయిన మావోయిస్టులకు యువతరం పార్టీ ఆహ్వానం పలుకుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు.

February 26, 2026 / 07:20 PM IST

‘జిల్లాలో 656 వ్యవసాయ సర్వీసుల మంజూరు’

JGL: జగిత్యాల జిల్లాలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులను గరిష్ఠ స్థాయిలో మంజూరు చేసినట్లు SE బి. సుదర్శనం తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 656 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేశామన్నారు.

February 26, 2026 / 07:20 PM IST

స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

తూ.గో: ఢిల్లీలో జరిగిన కార్మిక, జౌళీ మరియు నైపుణ్యాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జౌళీ మంత్రిత్వ శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను కమిటీ పరిశీలించినట్లు తెలిపారు.

February 26, 2026 / 07:17 PM IST

అధికారులు మంచిగా పనిచేయాలి: రేవంత్ రెడ్డి

TG: గ్రూప్-1,2 ఉద్యోగుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేది.. కోటీశ్వురులు, అధికార దాహం ఉన్నవారు కాదన్నారు. ఆత్మగౌరవం కోసమన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ.. అవమానాన్ని సహించరని అన్నారు.

February 26, 2026 / 07:16 PM IST

ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతు మృతి

MDK: మాసాయిపేట మండలం బొమ్మారంకు చెందిన మెట్టెల నాగరాజు (25) ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లయ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ట్రాక్టర్ ట్యాంకరు బోల్తాపడగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

February 26, 2026 / 07:15 PM IST

పెండింగ్ ప్రతిపాదనలకు త్వరిత ఆమోదం కోరిన మంత్రి

అన్నమయ్య: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు. టెంపుల్స్ డెవలప్‌మెంట్ ఫండ్ సహా పలు పథకాల కింద ఇప్పటికే రూ.17 కోట్లు విడుదలైనట్లు, మరో రూ.20 కోట్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ ప్రతిపాదనలకు త్వరిత ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

February 26, 2026 / 07:15 PM IST

భక్తుల సౌకర్యం కోసం మెట్లు ఏర్పాటు

AKP: మాడుగుల సమీపంలోని తాచేరు నది వద్ద భక్తుల సౌకర్యార్థం మెట్లు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం సర్పంచ్ యడ్ల కళావతి, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి, ఉప సర్పంచ్ జవ్వాది వరహాలు ఈ పనులను ప్రారంభించారు. పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న ఈ మెట్ల ద్వారా భక్తులు సులభంగా నదిలోకి వెళ్లి స్నానం చేయగలరని చెప్పారు.

February 26, 2026 / 07:14 PM IST

‘పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించాలి’

NDL: సుండిపెంట గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వబడలేదని వారు మండిపడ్డారు. కుటుంబాలతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. కార్మికులకు పీఎఫ్, ఈపీఎఫ్, ఆరోగ్య-పని భద్రత వంటి హక్కులు అమలు చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

February 26, 2026 / 07:14 PM IST