అన్నమయ్య: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు. టెంపుల్స్ డెవలప్మెంట్ ఫండ్ సహా పలు పథకాల కింద ఇప్పటికే రూ.17 కోట్లు విడుదలైనట్లు, మరో రూ.20 కోట్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ ప్రతిపాదనలకు త్వరిత ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.