E.G: మండపేట పురపాలక సంఘ కమిషనర్ టి.వి.రంగారావు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్రటరీలు మండపేటలోని పాల కేంద్రాలను తనిఖీ చేశారు. మండపేట పట్టణ పరిధిలో ఉన్న 16 పాలకేంద్రాలలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తులు నాణ్యత పరిశీలించి, ఏ విధమైన పాల ఉత్పత్తులు నిల్వ ఉంచరాదని పేర్కొన్నారు.