• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వ విద్యుత్ ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, బూడిద బస్తీలో ప్రభుత్వ విద్యుత్ ఇప్పించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వినతిపత్రం సమర్పించారు. సింగరేణి సంస్థ విద్యుత్ కనెక్షన్లు తొలగించినందున వెంటనే ప్రభుత్వ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.

March 5, 2026 / 06:38 AM IST

‘త్వరితగతిన గ్రామ కమిటీల నియామకం చేపట్డాలి’

VZM: నెల్లిమర్ల మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు బుధవారం భోగాపురం మండలంలోని బైరెడ్డిపాలెం, చేపలకంచేరు, ముక్కాం, రామచంద్ర పెట గ్రామాల్లో YCP గ్రామ కమిటీ సభల్లో పాల్లొన్నారు. ఆయన మాట్లాడుతూ.. త్వరితగతిన గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేసారు. కమిటీల నియామకం పూర్తి చేసి మండల YCP కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డికి అందజేయాలని సూచించారు.

March 5, 2026 / 06:37 AM IST

నవీపేట్లో సైబర్ క్రైమ్ కేసు నమోదు

NZB: నవీపేట్లో సైబర్ మోసం ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గంగాధర్‌కు ఫిబ్రవరి 22న ట్రాఫిక్ ఈ-చలాన్ పేరుతో ఓ APK ఫైల్ వాట్సాప్ ద్వారా వచ్చింది. వాహనంపై చలానా పడుతుందేమో భావించి ఫైల్ డౌన్లోడ్ చేయగా అతని ఖాతా నుంచి రెండు దఫాల్లో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్ష కట్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

March 5, 2026 / 06:35 AM IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న సర్పంచ్

MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు నెరవేర్చుతున్నారు. బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి సర్పంచ్ జాడి మహేశ్వర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో పేదింటి ఆడపిల్ల వివాహ కానుకగా రూ.2516 ఇచ్చి హామీ నెరవేర్చుకున్నారు. స్థానికులు సర్పంచ్‌ను అభినందించారు.

March 5, 2026 / 06:34 AM IST

గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

PDPL: గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణపై ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. మార్చి 6–16 పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడం, ఏప్రిల్ 2 గ్రామస్థాయి సమావేశానికి శాఖల సమన్వయం, పారిశుధ్యం, పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు.

March 5, 2026 / 06:32 AM IST

CCLA వీసీలో పాల్గొన్న జిల్లా అధికారులు

PPM: జిల్లాల్లో రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా నుంచి అర్హులైన వారి భూములకు హక్కులు కల్పించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో అమరావతి నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు.

March 5, 2026 / 06:32 AM IST

‘డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు’

ASF: జిల్లాలో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడె ఒక ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోడ్ అధికంగా ఉన్న దహెగాం, గుండాయపేట్, నజ్రూల్ నగర్ సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

March 5, 2026 / 06:30 AM IST

రేపు ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ, మోడల్ కెరీర్ సెంటర్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో 322 ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టారు. ఫార్మసిస్ట్ సీఎస్‌ఏ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

March 5, 2026 / 06:29 AM IST

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి: ఏపీవో

AKP: దేవరాపల్లి మండలంలో ఉపాధి హామీ పనుల అమలును అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రైవాడ, గరిసింగి, దేవరాపల్లి పంచాయతీల్లో జరుగుతున్న పనులను ఏపీఓ రుక్మిణీదేవి, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణరావు పరిశీలించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వలసలు తగ్గించుకోవాలని కూలీలకు సూచించారు.

March 5, 2026 / 06:29 AM IST

కూతురిని మోసం చేసిన కేసులో తల్లి అరెస్ట్

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ హెడ్ కుక్ డి.రమణమ్మను చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో బుధవారం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన సొంత కూతురు ప్రదీపకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రమణమ్మ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసింది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి అనూష నిందితురాలికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు.

March 5, 2026 / 06:27 AM IST

‘ప్రభుత్వ ఓఆర్ఎస్ ప్యాకెట్లనే వాడండి’

SKLM: జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసే ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ పృథ్విరాజ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక రిమ్స్‌లో సమావేశం నిర్వహించారు. ఆయన మట్లాడుతూ.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ వైద్య సిబ్బంది సరఫరా చేసిన ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వాడుట ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.

March 5, 2026 / 06:27 AM IST

రోజులో కేవలం 12గంటల్లోపే సరఫరా

BHNG: జిల్లాలో సుమారు 4లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అయితే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కనీసం 12గంటల నుంచి 14 గంటలు కూడా సరఫరా చేయడం లేదు అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

March 5, 2026 / 06:27 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

KDP: కొండాపురం మండలం డొంకపల్లి గ్రామంలోని ఆశ్రమం గుడి వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఎస్సై జయరాములు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,040 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

March 5, 2026 / 06:26 AM IST

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

JGL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల పనుల లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, కార్యాలయాల పరిశుభ్రత తదితర విషయలపై సమీక్షించారు.

March 5, 2026 / 06:26 AM IST

నేడు నారా లోకేష్ విశాఖ రాక

VSP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు వాయుమార్గం ద్వారా విశాఖపట్నం చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వాల్తేర్ క్లబ్‌లో జరిగే రమణబాబు కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు.

March 5, 2026 / 06:24 AM IST