ASF: జిల్లాలో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడె ఒక ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోడ్ అధికంగా ఉన్న దహెగాం, గుండాయపేట్, నజ్రూల్ నగర్ సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.