MNCL: కాసిపేట్ మండలం ముత్యంపల్లిలో కాసిపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా ACP కిరణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ACP మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి పెంపోందించుకోవాలని, క్రీడలు క్రమశిక్షణ, జట్టు భావన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢత్వం పెరుగుతుందన్నారు.