నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘స్వయంభు’. విజువల్ గ్రాండియర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కథా దృష్ట్యా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు నిఖిల్ స్వయంగా ప్రకటించాడు. 2026 ఏప్రిల్ 10న తొలి భాగాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపయ్యాయి.
SRD: పటాన్‌చెరు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన నాగఅక్షయ లక్ష్మి (బీఏ ఫైనల్ ఇయర్), రుద్రారం గీతం యూనివర్సిటీలో చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తాను బయటకు వెళ్తున్నానని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని యూకేలో ఉన్న సోదరుడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
NLG: చందంపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ పీఎం నోడల్ ఆఫీసర్ కమలేష్ కుమార్ మిశ్రా సందర్శించారు. పాఠశాలలోని వసతులు, విద్యా బోధన తీరును ఆయన స్వయంగా పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, డీఈవోబీ. భిక్షపతి, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
MDK: శివంపేట మండలంలోని కొత్తపేటలో ఉపాధి హామీ పనులు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో జరుగుతుండటంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో కనీసం తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్ సౌకర్యాలు లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి, పని ప్రదేశంలో ప్రాథమిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
BDK: ఇల్లందులో పారిశుద్ధ్య విధుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల జ్ఞాపకార్థం ఫిబ్రవరి 28న సంజయ్ నగర్ సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద సంతాప సమావేశం నిర్వహించనున్నట్లు టీయూసీఐ నేతలు తెలిపారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు.
E.G: గోపాలపురం MLA మద్దిపాటి వెంకట్రాజు సహకారంతో గురువారం దేవరపల్లిలో బాధితులకు CM సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 4.29లక్షల విలువైన చెక్కులను గ్రామ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ల మునేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నేతలు పేర్కొన్నారు.
AP: శాసనమండలిలో ఛైర్మన్ కీలక ప్రకటన చేశారు. నిన్న సభను అధికారపక్షం అడ్డుకుందని అన్నారు. లడ్డూపై చర్చ జరగకుండా అధికారపక్షం సభను తప్పుదోవపట్టించిందని తెలిపారు. ఛైర్మన్ వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తాము దేనికైనా చర్చకు సిద్దమన్నారు. లడ్డూపై చర్చ అంటేనే వైసీపీ సభ్యులు పారిపోతున్నారని ఆరోపించారు.
W.G: చింతలపూడిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆన్ లైన్ పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి మెమో 57 తక్షణమే అమలు చేయాలని కోరారు.
VSP: ప్రభుత్వ అధికారులమని నమ్మించి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.1.05 కోట్లు కాజేసిన కేసులో ఆరుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధార్ కేసుల పేరుతో బాధితుడిని భయపెట్టి విడతల వారీగా డబ్బు వసూలు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు అందిస్తూ కమిషన్లు పొందుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశానన్నారు.
KMM: డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
VZM: నెల్లిమర్ల మండలంలోని సతివాడ గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర గురువారం రాత్రి ఘనంగా జరిగింది. సుమారు 20 గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారి అలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అమ్మవారి చదును నుంచి సిరిమాను మూడు సార్లు తిరిగింది. ఆ సమయంలో అమ్మవారి దర్శనంకు భక్తులు పోటీపడ్డారు.
BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అరుంధతి నగర్‌లో సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న OHSR వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే నిర్మాణం నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆర్యవైశ్య సంఘం సభ్యుడు శ్రీనివాసులు కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
CTR: సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.
CTR: సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.