• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి’

PPM: ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సంభమూర్తి డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్చ్ 5వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజు ఏదో ఒక యాప్‌తో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 3, 2026 / 08:13 PM IST

అప్పుల గొడవతో గృహిణి ఆత్మహత్య

NLG: అప్పుల విషయంపై భర్తతో జరిగిన గొడవతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలం సుంకెనపల్లిలో చోటుచేసుకుంది. భర్త శేఖర్ లారీ కోసం చేసిన అప్పులపై ఫిబ్రవరి 25న గొడవపడ్డారు. మనస్తాపం చెందిన బొజ్జ పావని (35) ఒంటిపై టర్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మరణించిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 3, 2026 / 08:12 PM IST

జాతీయ రహదారిపై ఇల్యూమినేషన్ లైట్లు

AKP: జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో ప్రమాదాల నివారణకు ఇల్యూమినేషన్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేని షేకిళ్లపాలెం, మర్రిబంద,పోతిరెడ్డిపాలెం గ్రామాల వద్ద నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు.

March 3, 2026 / 08:12 PM IST

చిన్నస్వామి స్టేడియం వేదికగా IPL ఫైనల్..?

ఐపీఎల్ 19వ సీజన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానున్నట్లు సమాచారం. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య తొలి పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.

March 3, 2026 / 08:12 PM IST

వెలుగు వృద్ధాశ్రమం, చిల్డ్రన్ హోమ్‌ల తనిఖీ

విజయనగరంలోని ATK వెలుగు వృద్ధాశ్రమం, పెద్దతాడివాడిలోని మెర్సీ మిషన్ చిల్డ్రన్ హోమ్‌ను మంగళవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వృద్ధులు, బాలలతో మాట్లాడి వారి బాగోగులు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అని విచారించారు.

March 3, 2026 / 08:11 PM IST

ఈనెల 6న గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు

KNR: కరీంనగర్ 2 డిపో నుంచి, ఈనెల 6న గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు, డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో ఉడిపి, ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ దర్శనం, గోవా బీచ్ లో ముఖ్య ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. మార్చి 6న సా.4 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 10న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు.

March 3, 2026 / 08:11 PM IST

హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారు: మాజీ ఎంపీ

కోనసీమ: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అమలాపురం మాజీ ఎంపీ చింత అనురాధ పేర్కొన్నారు. చలో విజయవాడ” పిలుపుతో ధర్నా చౌక్‌లో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించాలన్నారు. అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.

March 3, 2026 / 08:11 PM IST

జిల్లా జెఏసీ-కో ఛైర్మన్‌ నియామకం

VZM: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జిల్లా ఐక్యవేదిక జేఏసీ కో ఛైర్మన్‌గా PRTU జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్ర నాయుడు మంగళవారం నియామకం అయ్యారు. పీఆర్సీ, డీఏలు, ఎర్నాడ్ లీవ్, ఎన్కాష్మెంట్ ఇతర ఆర్థిక పరమైన విషయాలపై భవిష్యత్తులో పోరాటాలకు పనిచేస్తామని తెలిపారు. ఇవాళ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

March 3, 2026 / 08:11 PM IST

హోలీ సంబరాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

NZB: డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల కొండ ప్రశాంత్ రెడ్డి (నగేష్ రెడ్డి) ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పంటలు బాగా పండి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. పరస్పరం రంగులు పూసుకుంటూ పండుగ జరుపుకున్నారు.

March 3, 2026 / 08:10 PM IST

ఆత్మకూరులో మున్సిపల్ స్థలంపై కబ్జా యత్నం

NDL: ఆత్మకూరులో మున్సిపాలిటీకి చెందిన కూరగాయల సంత మార్కెట్ స్థలంపై కబ్జా యత్నం జరిగింది. రక్షణగా ఉన్న ప్రహరీ గోడను అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కూల్చివేశారు. దీంతో మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకుని వెంటనే గోడ పునర్నిర్మించాలని ప్రజలు మున్సిపల్ కమిషనర్‌ను కోరుతున్నారు.

March 3, 2026 / 08:10 PM IST

ఇరాన్‌పై మారణకాండ ఆపాలి: ఐఎఫ్టీయూ

ATP: అమెరికా, ఇజ్రాయిల్ మరణకాండకు నిరసనగా అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. 7 శతాబ్దాలుగా ప్రపంచంలో జరిగే యుద్ధాలు మరణకాండకు మూల కారణం అమెరికా దేశమని వారు పేర్కొన్నారు. ఇరాన్‌పై మారణకాండ ఆపాలన్నారు.

March 3, 2026 / 08:09 PM IST

మాజీ సీఎం పేరిట తప్పుడు ట్వీట్.. జనసేన ఫిర్యాదు

AP: టీటీడీ ఛైర్మన్ BR నాయుడు అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్ చేశారని జనసేన నేత వి.నారాయణరావు ఆరోపించారు. ఛైర్మన్‌పై నాదెండ్ల భాస్కరరావు ట్వీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పోలీసులకు ఆయన తెలిపారు. ఆ పోస్టుకు నాదెండ్ల భాస్కరరావుకు సంబంధం లేదని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

March 3, 2026 / 08:08 PM IST

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలు

SRCL: ఇల్లంతకుంట మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ సంబరాలు మిన్నంటాయి. క్లబ్ ప్రతినిధులు, సభ్యులు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హోలీ పండుగ సామాజిక సామరస్యానికి, స్నేహభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. క్లబ్ కార్యవర్గ సభ్యులు, మండల విలేకరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 08:06 PM IST

టీమిండియాపై చంద్రగ్రహణం ఎఫెక్ట్

చంద్రగ్రహణం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు ఆటంకం కలిగింది. వాంఖడే స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారత జట్టు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే, సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం ప్రభావం ఉండటంతో, ప్రాక్టీస్ సెషన్‌ను గంట సేపు వాయిదా వేశారు. గ్రహణం సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భారత జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

March 3, 2026 / 08:05 PM IST

ఇస్నాపూర్‌లో కౌన్సిలర్ సభ్యత్వం రద్దు

TG: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో విప్ ధిక్కరించిన కౌన్సిలపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఇస్నాపూర్ 8వ వార్డ్ కౌన్సిలర్ మాధవి సభ్యత్వం రద్దు చేశారు.

March 3, 2026 / 08:05 PM IST