NZB: నవీపేట్లో సైబర్ మోసం ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గంగాధర్‌కు ఫిబ్రవరి 22న ట్రాఫిక్ ఈ-చలాన్ పేరుతో ఓ APK ఫైల్ వాట్సాప్ ద్వారా వచ్చింది. వాహనంపై చలానా పడుతుందేమో భావించి ఫైల్ డౌన్లోడ్ చేయగా అతని ఖాతా నుంచి రెండు దఫాల్లో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్ష కట్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.