MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, బూడిద బస్తీలో ప్రభుత్వ విద్యుత్ ఇప్పించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వినతిపత్రం సమర్పించారు. సింగరేణి సంస్థ విద్యుత్ కనెక్షన్లు తొలగించినందున వెంటనే ప్రభుత్వ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.