• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రొద్దుటూరు- బెంగళూరుకు రైలు నడపాలని సీఎంకు వినతి

KDP: ప్రొద్దుటూరు మీదుగా బెంగుళూరుకు రైలు నడపాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసినట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీ కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమై వినతి పత్రం ఇచ్చామన్నారు. కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం అవసరం లేకుండానే, నంద్యాల నుంచి ప్రొద్దుటూరు, తాడిపత్రి, ధర్మవరం మీదుగా బెంగుళూరుకు రైలు నడపాలని సీఎంను కోరారు.

February 27, 2026 / 07:45 AM IST

దామర్చేడ్ అంగన్వాడీలో ‘ఆయా’ కొరత

VKB: దామర్చేడ్ అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేకపోవడంతో చిన్నారుల సంరక్షణ, క్లీనింగ్ బాధ్యత కష్టతరంగా మారింది. కొంతకాలంగా ఆయా పోస్టు ఖాళీగా ఉండటంతో నిర్వహణ భారమంతా టీచర్‌పైనే పడుతోంది. టీచర్ మండల స్థాయి సమావేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం మూసి వేసే పరిస్థితి నెలకొంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఒక ఆయాను నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

February 27, 2026 / 07:44 AM IST

‘ఉగాది నాటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి’

PPM: జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో గృహ నిర్మాణ పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉగాది పండగ నాటికి మొత్తం 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.

February 27, 2026 / 07:44 AM IST

ప్రాజెక్ట్ పురోగతి పనులపై సమీక్షలు నిర్వహించిన కలెక్టర్

WGL: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సాయంత్రం దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.సత్య శారద. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడకూడదని, ప్రతి దశలో సాంకేతిక ప్రమాణాలు పాటించాలని కోరారు.

February 27, 2026 / 07:43 AM IST

యాదాద్రిలో కన్నులపండువగా బ్రహ్మోత్సవాలు 

TG: యాదాద్రిలో కన్నులపండువగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టనున్నారు. రాత్రికి శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలిరానున్నారు.

February 27, 2026 / 07:42 AM IST

ఘనంగా ప్రారంభమైన సోమాలమ్మ అమ్మవారి జాతర

E.G: రాజమండ్రిలోని శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేశ్, దీపిక దంపతులు పంచామృత అభిషేకంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

February 27, 2026 / 07:40 AM IST

‘మున్సిపల్ కార్మికుల CIG గ్రూపులను కొనసాగించాలి’

NZB: మున్సిపల్ కార్మికుల సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని TUCI, CITU, AITUC కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. సుధాకర్, ఓమయ్య, ఏ.రమేష్ బాబు పాల్గొన్నారు.

February 27, 2026 / 07:40 AM IST

కార్పొరేషన్‌లో పాల్వంచ పేరు చేర్చాలంటూ ఉద్యమం

BDK: కొత్తగూడెం కార్పొరేషన్‌లో పాల్వంచ పేరును చేర్చాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ఊపందుకుంది. ఇటీవల సుజాతనగర్ లోని 7 గ్రామాల విలీనంతో 60 డివిజన్లుగా కార్పొరేషన్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్పొరేషన్ పేరులో తమ ప్రాంత గుర్తింపు ఉండాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, కోర్టు కేసుల వల్ల పాల్వంచ మున్సిపాలిటీకి ఏళ్ల తరబడి ఎన్నికలు జరగలేదు.

February 27, 2026 / 07:40 AM IST

మరమ్మతులు పూర్తి.. రాకపోకలకు పునఃప్రారంభం

KMR: ఉప్పల్వాయి – కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద వారం రోజులుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు గురువారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో మూసివేసిన రైల్వే గేట్‌ను అధికారులు తిరిగి వాహన రాకపోకలకు తెరిచారు. మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు గేట్ పునఃప్రారంభంతో ఊపిరిపీల్చుకున్నారు.

February 27, 2026 / 07:40 AM IST

‘యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు ముందుకు రావాలి’

SRD: రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుండడంతో యువకులలో నిరుత్సాహ,నిష్పృశ్యలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య పోవడానికి ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు రంగ సంస్థలు సైతం ముందుకు రావలసిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి, వసతి గృహసముదాయానికి  నిధులు ఇవ్వాలని పరిశ్రమ యజమానులను కోరారు.

February 27, 2026 / 07:40 AM IST

రేపటి నుంచి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 5 వరకు వైభవంగా జరగనున్నాయి. రేపు అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. మార్చి 2న స్వామివారి కళ్యాణం, 3న రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 4న అశ్వ వాహన సేవ, 5న నాగవెల్లి తో వేడుకలు ముగియనున్నాయి. భక్తులు భారీగా తరలిరావాలని ఆలయ కమిటీ కోరింది.

February 27, 2026 / 07:40 AM IST

అన్నా, వదినా అంటూ ఆనంద్ దేవరకొండ పోస్ట్

విజయ్, రష్మిక పెళ్లి నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వదిన తన కుటుంబంలో భాగమయ్యారని.. విజయ్, రష్మికతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ఇన్ని రోజులు మా కుటంబంలో నలుగురు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మా వదినమ్మ కూడా జాయిన్ అయ్యారు. పాజిటివ్ మనస్థత్వం కలిన వ్యక్తిని నా అన్న విజయ్ వివాహం చేసుకున్నాడు. వారు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.

February 27, 2026 / 07:40 AM IST

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి వద్ద గురువారం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల అఖిల్ మృతి చెందాడు. నెల్లూరులో ఉపాధి కోసం బైకుపై వెళుతున్న అఖిల్, నిరంజన్లను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిరంజన్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 07:38 AM IST

ప్రమాదంలో ఒకరి మృతి.. ఇరువురికి గాయాలు

NLG: నార్కట్‌పల్లిలో దుకాణాల మీదికి దూసుకెళ్లిన లారీ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇరువురికి గాయాలు అయ్యాయి. బండల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పడంతో మాండ్రగామానికి చెందిన మేడి కృష్ణ లారీ కింద పడి మృతి చెందాడు. డ్రైవర్‌ను క్యాబిన్లో ఇరుక్కోగా పోలీసులు బయటికి తీశారు. పండ్ల వ్యాపారి గౌస్‌కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 27, 2026 / 07:37 AM IST

సికింద్రాబాద్‌లో నేడు కిషన్ రెడ్డి పర్యటన

TG: సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పలు బస్తీలల్లో తిరగనున్నారు. ఉదయం 11 గంటలకు కోఠి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీల ధర్నాలో పాల్గొననున్నారు.

February 27, 2026 / 07:35 AM IST