SRD: రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుండడంతో యువకులలో నిరుత్సాహ,నిష్పృశ్యలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య పోవడానికి ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు రంగ సంస్థలు సైతం ముందుకు రావలసిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి, వసతి గృహసముదాయానికి నిధులు ఇవ్వాలని పరిశ్రమ యజమానులను కోరారు.