ADB: ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మర్చి 10వ తేదీన జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేయాలనీ SI ప్రణయ్ అన్నారు. శుక్రవారం గాదిగూడ పోలీస్ స్టేషనులో సిబ్బందితో కలిసి జాబ్ మేళ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఇది సుదీర్ఘమైన అవకాశమని పేర్కొన్నారు.
ప్రకాశం: గాలివీడులో ఈ నెల 17న జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితులు ప్రొద్దుటూరు, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
TG: గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరో రూ.389 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం కావడంతో పాటు, ఉద్యోగుల ఆర్థిక అవసరాలు తీరనున్నాయి.
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ మధ్య గల ఖాళీ స్థలంలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండిన చెట్లు, పొదలకు మంటలు వ్యాపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను ఆర్పివేశారు. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సీపీ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
RR: ఇబ్రహీంపట్నంలో ప్రజాతీర్పును అధికార బలం వెక్కిరిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 15 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినా, 8 స్థానాలున్న కాంగ్రెస్ కూడా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కిడ్నాప్ రాజకీయాలు, అధికారులపై ఒత్తిళ్ల నేపథ్యంలో మున్సిపల్ రాజకీయ చదరంగంలో ఎవరికెవరు చెక్ పెడతారో చూడాలి.
AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నాణేలకు బదులు ముడుపుపత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతి, తిరుమలలో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, నెఫ్ట్ ద్వారా నగదును పంపితే ముడుపు పత్రాలు అందిస్తారు. వాటిని నేరుగా హుండీలో వేయొచ్చు. భక్తులకు నాణేలను, నగదును తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.
ATP: రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న భం షేక్ అబ్దుల్ వహబ్ 57వ ఉరుసు ఉత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు. మార్చి 1వ తేదీన గంధం కార్యక్రమం, రెండవ తేదీన చిత్రపటం ఊరేగింపు, దీపారాధన, మూడవ తేదీన షంషీర్ బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వభక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
కోనసీమ: ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో పితాని బాలకృష్ణ (51) అనే వ్యక్తి భవనం పైనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పిట్టగోడపై ఇటుకలు అందిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: కంకిపాడులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో SP విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ గురువారం సాయంత్రం శుక్రవారం ఏర్పాట్లును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించి, సీఎం ప్రయాణించే ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అదనపు SP సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, DSPలు శ్రీనివాసరావు, CI పాల్గొన్నారు.
ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త లోగో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ‘పాపం ప్రతాప్’ మూవీని ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేస్తామంది.
ADB: బోథ్ మండలంలోని కౌటా గ్రామంలో శబరిమాత ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
MNCL: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తండ్రి గోనె పోషం ఇటీవల మృతి చెందారు. విషయం తెలిసిన మంత్రి వివేక్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
JGL: మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వరదకాలువ (82.03km) బ్రిడ్జికి సంబంధించిన ఒక పిల్లరుకు పగుళ్లు ఏర్పడడంతో తాత్కాలికంగా బ్రిడ్జిని ఇరిగేషన్ అధికారులు మూసేశారు. ఈ బ్రిడ్జిపై నుంచి క్రషర్ల భారీ వాహనాల రాకపోకల కారణంగా బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి మూసేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
VSP: గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలో లారీ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడుకు చెందిన విజ్జి అనే లారీ డ్రైవర్ బెల్ కంపెనీకి లోడ్‌తో వచ్చారు.. సమీపంలో ఉన్న మైదానంలో ఆయన ఉరివేసుకున్నారు. అయితే ఆత్మహత్యలు గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియ రాలేదు.
AP: ఆయేషామీరా అవశేషాలను సీబీఐ జడ్జి తల్లిదండ్రులకు అప్పగించారు. సీబీఐ న్యాయమూర్తి ఎదుట ఆయేషా తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో ఆయేషామీరా అవశేషాల ఖననానికి ఏర్పాట్లు చేశారు. తెనాలి శ్మశానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో ఆయేషామీరా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించానున్నారు.