• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాలమూరు యూనివర్సిటీలో ప్రోటోకాల్ రగడ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో బుధవారం ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో బుధవారం ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఫోటో వేసి ఎంపీడీకే అరుణ ఫోటో వేయకపోవడంతో భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

February 25, 2026 / 02:23 PM IST

‘వార్డుల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు’

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 21వ వార్డులో చేస్తున్న డ్రైనేజీ కాలువ పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి బుధవారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. వార్డుల్లో పారిశుద్ధ పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా సమస్యలపై వెంటనే స్పందించాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్యం ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులదే కీలకపాత్ర అన్నారు.

February 25, 2026 / 02:22 PM IST

‘పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి’

MDK: పార్టీలకు అతీతంగా రామాయంపేట అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య సూచించారు. బుధవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు.

February 25, 2026 / 02:22 PM IST

లండన్‌లో తెలుగు వ్యక్తి మృతి

AP: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్(28) అనే వ్యక్తి లండన్‌లో మృతి చెందాడు. లండన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 02:22 PM IST

చిన్నారి హత్య.. వెలుగులోకి కొత్త విషయాలు

TPT: ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ తల్లి తన కుమార్తెను హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆశాలత భర్తతో విడాకులు తీసుకుని భరణం కింద రూ.4 లక్షలు పొందింది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెడ్డి కుమార్‌తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తోంది. వారి పెళ్లికి కుమార్తె అడ్డుగా ఉందని భావించి ఆమెను హత్య చేసి పూడ్చి పెట్టినట్లు సమాచారం.

February 25, 2026 / 02:22 PM IST

‘రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

MDK: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. బుధవారం చేగుంట మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

February 25, 2026 / 02:20 PM IST

సోమందేపల్లిలో వాషింగ్ మిషన్లు పంపిణీ

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఏపీ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో రజకులకు ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రయోజన పథకం కింద దాదాపు 50 వాషింగ్ మిషన్లు బుధవారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రజకుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని నాయకులు తెలిపారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

February 25, 2026 / 02:20 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పత్రం అందజేత

RR: నందిగామ మండల కేంద్రానికి చెందిన నర్సమ్మ అనే మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పత్రాన్ని వార్డు సభ్యులు ప్రవీణ్, గ్రామ యువకులు, అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతుందని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.

February 25, 2026 / 02:20 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ

బాపట్ల: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్  అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరీక్షలు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

February 25, 2026 / 02:20 PM IST

‘పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు’

SRC: జిల్లాలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబంధిత జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు.

February 25, 2026 / 02:20 PM IST

పేదల సొంత ఇంటి కల నెరవేర్చండి: కోవూరు ఎమ్మెల్యే

నెల్లూరు: గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పేదల సొంత ఇంటి కల కలగానే మిగిలి పోయిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ సమావేశాలలో పేదలకు పక్కా ఇళ్ల సమస్యపై ఆమె మాట్లాడుతూ.. ​గత ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు.

February 25, 2026 / 02:18 PM IST

మున్సిపల్ కమిషనర్‌ పై సస్పెన్షన్ వేటు

శ్రీకాకుళం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న డయేరియా ఘటన పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కుర్మారావును బుధవారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమయ్యారని ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

February 25, 2026 / 02:18 PM IST

‘విలీన గ్రామాల సమస్య పరిష్కరించాలి’

PLD: చిలకలూరిపేటలో విలీనమైన పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామాలపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మండలిలో మాట్లాడారు. కోర్టు కేసుల వల్ల వీటికి పంచాయతీ, మున్సిపల్ నిధులు రాక ఐదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కోర్టు కేసును త్వరగా పరిష్కరించాలని కోరారు. వెంటనే ఆ గ్రామాలకు నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేపట్టాలని కోరారు.

February 25, 2026 / 02:17 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన MLA

HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ యూత్ నాయకులు ప్రణయ్ రెడ్డి – వైష్ణవి రెడ్డి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా MLA KR నాగరాజు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 02:16 PM IST

ఆదిలాబాద్‌లో ముమ్మరంగా వంతెనల పనులు

ADB: జిల్లాలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ROB, RUB పనులు వేగవంతమయ్యాయి. తాంసి బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జి, ఆర్టీవో కార్యాలయం వద్ద ఓవర్ బ్రిడ్జి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి మూడు నెలల్లో పూర్తి కానున్నాయి. దీంతో రైల్వే గేటు వద్ద ఏళ్ల తరబడి పడుతున్న ట్రాఫిక్ ఇక్కట్లు తీరనున్నాయి. ఎట్టకేలకు పనులు కొలిక్కి వస్తుండటంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 25, 2026 / 02:16 PM IST