నెల్లూరు: గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పేదల సొంత ఇంటి కల కలగానే మిగిలి పోయిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ సమావేశాలలో పేదలకు పక్కా ఇళ్ల సమస్యపై ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు.