• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గాద ఇన్నయ్యకు పితృవియోగం

JN: జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన మాజీ మావోయిస్టు ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) శనివారం ఉదయం స్వగృహంలో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. అయితే ఇప్పటికే గత నెలలో ఇన్నయ్య తల్లి తేరేజమ్మ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మావోయిస్టు భావజాల వ్యాప్తి ఆరోపణలతో గాదె ఇన్నయ్య జైలులో ఉన్నారు.

February 28, 2026 / 11:18 AM IST

రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తొలి స్థానం

ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోదై రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. కేంద్ర పథకాల లబ్ధికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు సూచించారు.

February 28, 2026 / 11:17 AM IST

రికార్డు సృష్టించనున్న జమ్మూకశ్మీర్ జట్టు

జమ్మూకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని సొంతం చేసుకోనుంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్‌లో J&K విజయం దాదాపు ఖరారైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన J&K.. చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోనుంది. ఇవాళ 5వ రోజు ఆట కొనసాగనుంది. అయితే, ఆ సంబరాల్లో పాల్గొనేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన బృందంతో కలిసి హుబ్లీకి బయలుదేరి వెళ్లారు.

February 28, 2026 / 11:17 AM IST

పీఏసీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: అమరావతి అసెంబ్లీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ ఎక్కౌంట్స్ కమిటీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడి హోదాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయం, ఖర్చులను అక్కౌంట్స్ నమోదు చేస్తాయని చెప్పారు.

February 28, 2026 / 11:16 AM IST

విడతల వారిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే

ADB: ఇచ్చోడ మండలంలోని జామిడి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామస్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేర్చి గ్రామాన్ని విడతల వారిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

February 28, 2026 / 11:16 AM IST

బార్లీ వాటర్‌తో బోలెడు ప్రయోజనాలు

బార్లీ వాటర్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చలవ చేసి ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడమే కాకుండా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం బరువు తగ్గడానికి, మలబద్ధకం దూరం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

February 28, 2026 / 11:16 AM IST

అన్నదాతలకు అందని మద్దతు ధర

జగిత్యాల జిల్లాలో పండే ప్రధాన పంటల్లో ఒకటైన పసుపు పంట రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓట్ల ఏటీఎం గానే పనిచేస్తుంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన నాయకుల హామీలు నీటి మూటలుగానే నిలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతుండగా, ప్రస్తుతం క్వింటాల్ పసుపు రూ. 9వేల-రూ.14వేల వరకు మాత్రమే ధర పలుకుతుంది.

February 28, 2026 / 11:15 AM IST

వైసీపీపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి విమర్శలు

AP: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో మంత్రి డీఎస్‌బీవీ స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని కొనియాడారు. కల్తీ నెయ్యిపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ పారిపోతోందని ఎద్దేవా చేశారు. చర్చ జరగకుండా సభ నుంచి తప్పించుకున్నా.. దేవుడి నుంచి తప్పించుకోలేరని అన్నారు.

February 28, 2026 / 11:14 AM IST

న్యాయవగాహన సదస్సు

మహబూబ్నగర్ రూరల్ ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిఎల్వి శివన్న పంతులు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత, విద్య, సైబర్ నేరాలు, వరకట్నం, బాల కార్మికులు, తదితర చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవా అధికార సంస్థ అండగా ఉంటుందన్నారు.

February 28, 2026 / 11:13 AM IST

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

ATP: ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు శనివారం ఉదయం లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసిందని తెలిపారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం కోసమే ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.

February 28, 2026 / 11:10 AM IST

ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే ‘మన్ కి బాత్’

E.G: ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే ప్రధాని మోడీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాన్ కి బాత్ క్విజ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహుమతులు అందించారు.

February 28, 2026 / 11:10 AM IST

ఖాళీగా ఉన్న ANM పోస్టులను భర్తీ చేయండి సారూ.!

KMM: ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ANMల కొరత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా PHC పరిధిలో 5 ANM పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా గ్రామాల్లో వైద్య సేవలు సరిగా అందడం లేదని చెప్పారు. ఏఎన్ఎంల కొరత కారణంగా అదనపు బాధ్యతలతో సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలన్నారు.

February 28, 2026 / 11:09 AM IST

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

PLD: మాచవరం మండలం సింగరాయపాలెం తండా సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ వేడుకలు శనివారం ఘనంగా జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కొండ దిగువన గల కళ్యాణ మండపంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు పిల్లుట్ల సర్పంచ్ శివపార్వతి సాంబశివరావు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

February 28, 2026 / 11:08 AM IST

జిల్లా నూతన కార్యవర్గ నియమాకం..!

కర్నూలు: జిల్లా BJP కమిటీలో పలు కీలక పదవులకు కొత్త నియామకాలు చేపట్టారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా దాసరి యువరాజు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ షహీన్‌ను నియమించారు. అధికార ప్రతినిధులుగా లోకేష్, దేశాయి గురురాజ స్వామి, బోయ బ్రహ్మయ్యలను ఎంపిక చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు బాపురం రామకృష్ణ పిలుపునిచ్చారు.

February 28, 2026 / 11:08 AM IST

సిల్ట్ ఛాంబర్ లేకుండా.. వేల హోటళ్లు, రెస్టారెంట్లు!

HYDలో సిల్ట్ ఛాంబర్లు లేకుండా వేల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జలమండలి కఠిన చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. హోటల్ రెస్టారెంట్ల నుంచి భారీగా కూరగాయల వ్యర్ధాలు వచ్చి డ్రైనేజీలో కలుస్తుండడంతో బ్లాక్ కేజీ జరిగి మ్యాన్ హోల్స్ నుంచి పొంగి పొర్లుతుంది. దీంతో సిల్ట్ ఛాంబర్ తప్పనిసరి చేశారు.

February 28, 2026 / 11:07 AM IST