కర్నూలు: జిల్లా BJP కమిటీలో పలు కీలక పదవులకు కొత్త నియామకాలు చేపట్టారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా దాసరి యువరాజు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ షహీన్‌ను నియమించారు. అధికార ప్రతినిధులుగా లోకేష్, దేశాయి గురురాజ స్వామి, బోయ బ్రహ్మయ్యలను ఎంపిక చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు బాపురం రామకృష్ణ పిలుపునిచ్చారు.