కోనసీమ: అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామ అభివృద్ధికి కృషి చేసిన పంచాయతీ పాలకవర్గ ప్రజాప్రతినిధుల సేవలు ప్రశంసనీయమని పలువురు ఉద్యోగులు కొనియాడారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు బుధవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. సర్పంచ్ చెల్లుబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వార్డు సభ్యులంతా 5 సంవత్సరాల పాలనలో గ్రామ అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని ఉద్యోగులు ప్రశంసించారు.