• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాకుమాను నూతన ఎస్సైని అభినందించిన ఎస్పీ

GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బత్తుల హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శనివారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైని ఎస్పీ అభినందించారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.

February 28, 2026 / 06:55 PM IST

శ్రీమాతంగిశ్వరస్వామి సేవలో శంకర్ రెడ్డి

TPT: సత్యవేడు పట్టణంలోని శ్రీమాతంగిశ్వరస్వామి ఆలయాన్ని టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం దాత కృష్ణయ్య యాదవ్ రూ.50 వేల చెక్కును శంకర్ రెడ్డి చేతుల మీదుగా అర్చకులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 06:54 PM IST

పొన్నూరులో నోడల్ అధికారుల నియామకం

GNTR: స్వచ్ఛ సర్వేక్షణ 2025-26లో భాగంగా పొన్నూరు మున్సిపాలిటీలో 31 వార్డులకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. పట్టణానికి ఉన్నత ర్యాంకు సాధించడమే లక్ష్యంగా శనివారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌తో సమన్వయం చేసుకుంటూ వార్డుల్లో పరిశుభ్రత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

February 28, 2026 / 06:53 PM IST

విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

NTR: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కృష్ణానదిలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 35–40 ఏళ్ల వయస్సు కలిగినవాడిగా, ఒంటిపై బనియన్ మాత్రమే ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 06:53 PM IST

పరిహారం చెక్కులను అందజేసిన సీఎం

HYD: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాదిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన 44 కుటుంబాల వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటాం అంటూ భరోసా కల్పించారు.

February 28, 2026 / 06:52 PM IST

యర్రగొండపాలెంలో పెద్దపులి సంచారం

ప్రకాశం: యర్రగొండపాలెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన పొలాలకు సమీపంలోని నీటికుంట వద్దకు పెద్దపులి వస్తుందని స్థానికులు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించిన రైతులు, పొలాలకు వెళ్ళేందుకు ప్రాణభయంతో హడలి పోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 06:52 PM IST

‘వేగం కన్నా ప్రాణం మిన్న’

NDL: బేతంచెర్ల(మం) వేగం కన్న ప్రాణం ముఖ్యమని బేతంచెర్ల సీఐ డీ. వెంకటేశ్వరరావు, ఎస్సై రమేష్ బాబు అన్నారు. శనివారం బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌లో ఆటోడ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 28, 2026 / 06:52 PM IST

‘మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవు’

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ చుట్టుగుంటలో ఉన్న ఎస్.కే.బి.యం స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవని తెలిపారు.

February 28, 2026 / 06:51 PM IST

‘జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు’

సూర్యాపేట జిల్లాలో రేపటి (మార్చి 1) నుంచి నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందనీ ఎస్పీ నరసింహ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదనీ అన్నారు. బాణాసంచా, DJలు నిషేధం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు.

February 28, 2026 / 06:50 PM IST

మోడీ పాలనలో దేశానికి ప్రమాదం: బీవీ రాఘవులు

KMM: మోడీ పాలనలో దేశానికి ప్రమాదం ఏర్పడిందని సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శనివారం ఖమ్మం బోసుబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన యర్రా శ్రీకాంత్  విగ్రహావిష్కరణ బహిరంగ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.‌ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం దివాళా తీయిస్తోందని పేర్కొన్నారు.

February 28, 2026 / 06:48 PM IST

వంద కోట్ల క్లబ్‌పై కన్నేసిన ‘దురంధర్ 2’!

బాలీవుడ్ చిత్రాలు ఇప్పటివరకు మొదటి రోజే వంద కోట్ల క్లబ్‌లో చేరలేకపోయాయి. అయితే, ‘దురంధర్ 2’ బాలీవుడ్ నుంచి ఆ మైలురాయిని అందుకునే మొదటి చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రోజు కేవలం హిందీ వెర్షనే సుమారు రూ.80 కోట్ల వసూళ్లు సాధిస్తుందని, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా మొత్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటుతుందని పేర్కొంటున్నాయి.

February 28, 2026 / 06:48 PM IST

సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

KRNL: కోసిగి(మం) కందుకూరులో NTR భరోసా పెన్షన్‌ను ఇవాళ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం నియోజకవర్గ TDP ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

February 28, 2026 / 06:46 PM IST

మెడికల్–ఫార్మా మాఫియాపై సీపీఐ ఆందోళన

కడపలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్, ఫార్మా రంగాల్లో నకిలీ మందులు, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లులతో ప్రజల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, మందుల కొరత వల్ల ప్రజలు ప్రైవేట్ వైద్యంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.

February 28, 2026 / 06:45 PM IST

కడియంలో అలహాబాద్ హైకోర్టు మాజీ సీజే పర్యటన

E.G: కడియం పల్ల వెంకన్న నర్సరీ శనివారం విశిష్ఠ అతిథి రాకతో సందడిగా మారింది. అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ బోస్లే తన కుటుంబంతో కలిసి నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా యువ రైతులు పల్ల వెంకటేశ్, వినయ్‌లు ఆయనకు బోన్సాయ్ మొక్కను బహూకరించి సాదర స్వాగతం పలికారు. నర్సరీలోని వివిధ రకాల అరుదైన మొక్కలను తిలకరించారు.

February 28, 2026 / 06:44 PM IST

బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

AP: సీఎం చంద్రబాబు వేట్లపాలెంలో పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాద స్పాట్‌లో అణువణువూ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.

February 28, 2026 / 06:44 PM IST