SRPT: మునగాల మండలం సీతానగరం గ్రామంలో పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా సోమవారం డ్రైనేజీ పూడికతీత పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ వీరయ్య స్వయంగా పనులను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం, సాధారణ రోజుల్లో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపించకుండా, దుర్వాసన రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
TG: హైదరాబాద్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమస్యల పరిష్కారం కోసం ’ధర్మవాణి‘ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. 10AM నుంచి 5PM వరకు అనేక మంది అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి తమ సమస్యలను విన్నవించారు. వారి సమస్యలను ఓపికగా విన్న కమిషనర్.. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి ఆదేశించారు.
NRPT: ధన్వాడ మండలంలోని కిస్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి స్వయం కృపరికాలన దినోత్సవం నిర్వహించుకున్నారు. పాఠశాల హెచ్ఎంగా సావిత్రి, డీఈవోగా శ్యామ్ రాజ్, ఎంఈవోగా శ్రీ చందన వ్యవహరించారు. ఉత్తమంగా విద్యా బోధన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్టు పాఠశాల హెచ్ఎం సరస్వతమ్మ తెలిపారు.
SKLM: మార్చి 14న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. సోమవారం స్థానిక DLSA కార్యాలయంలో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చన్నారు.
TG: వరంగల్ నగరానికి వంద ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన స్థలాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మడికొండలో ప్రతిపాదించిన 5 ఎకరాల స్థలంపై అధికారులు చర్చించారు. ఆ స్థలాన్ని ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించి, అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
KRNL: విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
TG: రాష్ట్రంలో మహిళల సమగ్ర అభివృద్ధి, భద్రత, ఆర్థిక సాధికారత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి సీతక్క సచివాలయంలో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మహిళా సంక్షేమం కేవలం ఒక్క శాఖకే పరిమితం కాకుండా.. విద్య, ఆరోగ్యం, పోలీస్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక ఉప-కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల రికార్డుల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటరమణ ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల పేర్లు భూభారతి పోర్టల్ నుంచి మాయమై ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలనిభూములపై పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
BPT: బాపట్ల జీబీసి రోడ్డు వద్ద జనసేన సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని, ఈ సభ్యత్వం వల్ల జనసేన నుండి అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిడుగు విజయ మాధురితో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
E.G: కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనున్న పలు అభివృద్ధి పనులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. పాఠశాలలో HDBFS- WASHI వారి ప్రోత్సాహంతో రూ. 17 లక్షల అంచనాలతో డైనింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనాలు పరిశీలించి విధ్యార్ధులతో ముచ్చటించారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో అడిషనల్ కలెక్టర్ నరసింగరావు, RDO శ్రీనివాసరావుతో కలిసి ప్రజలనుంచి 71 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ నమోదు చేసి వారంలోగా పరిష్కరించాలన్నారు.
SRPT: తప్పుడు అర్హత పత్రాలతో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్‌కు చెందిన యాపిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ తేజస్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. వైద్యుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారి వేంకట రమణ తెలిపారు.
NZB: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వరాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7 గంటల లోపు పూజాధి కార్యక్రమాలు ముగించి ద్వార బంధనం చేయనున్నట్లు అర్చకుడు గణేశ్ శర్మ తెలిపారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. గ్రహణ కాలంలో భక్తుల ఆర్జిత సేవలు రద్దు చేయడం జరిగిందన్నారు.
కోనసీమ: 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు (5-8 తరగతులు), జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం అమలాపురంలో సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31 లోపు అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష.=
న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌పై దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో జరిగే ఈ పోరులో గెలిచి, ఫైనల్‌కు చేరుకుంటామని ఘక్రి ధీమా వ్యక్తం చేశాడు. తమ హోం గ్రౌండ్ లాంటి అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ ఆడి తీరుతామని పేర్కొన్నాడు. కాగా, 2026 T20 WCలో సౌతాఫ్రికా అహ్మదాబాద్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.