టీ20 ప్రపంచకప్ సూపర్-8 భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లకు కూడా కొంత సహకారం లభిస్తుందని ప్రధాన క్యురేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని చెప్పాడు. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదని వెల్లడించాడు.
BHPL: గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నర్సంపేట పట్టణానికి చెందిన సురేష్ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఆచూకీ కనుగొన్నారు. ఆదివారం SI దివ్య ఆధ్వర్యంలో బాధితుడు సురేష్‌కు మొబైల్ ఫోన్ తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ హరీష్ ఉన్నారు.
తెలంగాణ పాలిసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉందన్నారు. జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఫీజు కట్టాల్సి ఉంటుంది. మే 13న రాత పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలకు polycet.sbtet.telangana.govను సంప్రదించండి.
GDWL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అలంపూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ పేర్కొన్నారు. ఎర్రవల్లి మండలం యుక్తాపూర్లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యుత్, సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు.
ADB: TPTF ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వృకోధర్ ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ అధ్యక్షుడిగా రామేశ్వర్, ఉపాధ్యక్షులుగా సాయికాంత్, శ్యాంరావు, బాపురావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
SRD: సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్లో మంచినీటి ట్యాంక్ నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అమృత్ 2.0 నిధుల్లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆరు మంచినీటి ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించారు. కాగా ప్రశాంత్ నగర్లో ఒక చోట మాత్రమే పిల్లర్ల స్థాయి వరకు నిర్మించి వదిలేశారు. మంచినీటి ట్యాంకులు నిర్మాణాలను వేగవంతం చేయించాలని కోరుతున్నారు.
సత్యసాయి: అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా పుట్టపర్తిలో ఆదివారం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ఈ ర్యాలీలో పాల్గొని స్వయంగా సైకిల్ తొక్కి అందరినీ ఉత్సాహపరిచారు. స్థానిక బస్టాండ్ నుంచి గణేష్ సర్కిల్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
MBNR: మహబూబ్‌నగర్ MVS డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ నెల 4 నుంచి 3వ సెమిస్టర్ సైన్స్, కంప్యూటర్స్ ప్రయోగ తరగతులు ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న వారినే అనుమతిస్తామని ప్రిన్సిపల్ డా. కె. పద్మావతి తెలిపారు. ఇతర వివరాలకు 73829 29609 నంబర్‌లో సంప్రదించాలని కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు.
కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప రూ.288.12 కోట్లు, ప్రొద్దుటూరు రూ.185.50 కోట్లు, పులివెందుల రూ.126.07 కోట్లు, బద్వేల్ రూ.117.90 కోట్లు, మైదుకూరు రూ.101.80 కోట్లు, ఎర్రగుంట్ల రూ.80.91 కోట్లు, జమ్మలమడుగు రూ.77.01 కోట్లు, ముద్దనూరు రూ.42.97 కోట్లు, సిద్దవటం రూ.33.52 కోట్లు మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు.
NGKL: రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఏటిగడ్డ నరసింహా రెడ్డి- రెడ్డి కన్వెన్షన్’ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి MLC కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రెడ్డి సేవా సమితి ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.
KMR: పల్వంచ మండలం వేల్పుగొండలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం ఐదేళ్ల బాలుడు ట్రాక్టర్‌పై ఆడుకుంటున్నాడు. తాళం చెవి ట్రాక్టర్‌కు ఉండటంతో దాన్ని స్టార్ట్ చేశాడు. వెనుక గేర్‌లో ఉండటంతో ఒక్కసారిగి వెనక్కి కదిలి ట్రాక్టర్ టైర్లు బాలరాజు ఛాతీపై నుంచి వెళ్లగా తీవ్రగాయాలయ్యాయి. అనంతరం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
NRPT: నారాయణపేట మండలం అంతారం ఆశ్రమంలో 510వ శివరామనామ జప యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. సంజీవయ్య, జగదీశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో మొదటిరోజైన శనివారం భక్తులు దంపతులతో కలిసి పాల్గొన్నారు. సోమవారం వరకు జరిగే ఈ యజ్ఞంలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. గ్రామ కార్యకర్తలు రమేశ్, ఆనంద్, శ్రీను ఏర్పాట్లను పర్యవేక్షించారు.
PPM: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేనన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కృషి చేస్తోందన్నారు.
JN: పాలకుర్తి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎల్లబోయిన చరణ్ స్టేషన్ ఘనపూర్లో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చరణ్‌ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
ASR: కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ, తన కుమారుడుతో కలిసి బైక్‌పై కేడీపేట వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని వాహనదారులు తెలిపారు. గమనించిన వాహనదారులు గాయపడిన ఇద్దరిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.