• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’

మార్కాపురంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని హాస్టల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, పరిశుభ్రతపై నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

March 6, 2026 / 04:50 PM IST

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: SI

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద ఎస్సై మర్రి వెంకట శివకుమార్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం నేరమని, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.

March 6, 2026 / 04:47 PM IST

‘జీడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’

SKLM: మందస మండలం హరిపురంలో మార్పు ట్రస్టు గ్రంథాలయంలో రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షులు మామిడి మాధవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడి పిక్కల గిట్టుబాటు కల్పించాలని వ్యవసాయ ఉద్యానవన అధికారులను కోరారు. అలాగే, పిచికారి యంత్రాలను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

March 6, 2026 / 04:46 PM IST

పేదలకు రంజాన్ కిట్ల పంపిణీ

SDPT: మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని 13వ వార్డులో పేద ముస్లింలకు బీఆర్ఎస్ నాయకులు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి  పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదని కిట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్ డాక్టర్ విఠోబ, నాయకులు పత్రి శ్రీనివాస్ యాదవ్, బషీర్, అన్వర్‌లు పాల్గొన్నారు.

March 6, 2026 / 04:45 PM IST

ఇంటర్ పరీక్షలు .. 15 మంది విద్యార్థులు గ్తెహాజరు

SRPT: తిరుమలగిరి మండలంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జువాలజీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, తదితర పరీక్షలకు మొత్తం 175 మంది విద్యార్థులకు గాను 160 మంది హాజరుకాగా, 15 మంది హాజరు కాలేదు. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

March 6, 2026 / 04:45 PM IST

ఈనెల 6వ తేదీ నుంచి 31వ తేదీ వరకు షెడ్యూల్ విడుదల

SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత తెలిపారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.

March 6, 2026 / 04:45 PM IST

క్యాతనపల్లి ఛైర్మన్ ఎన్నిక ఆలస్యం .. హైకోర్టు ఆగ్రహం

TG: మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి ఛైర్మన్ ఎన్నిక 3 వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్‌ ఎన్నికలు జరిగి నెలరోజులు అవుతున్నా.. ఛైర్మన్ ఎన్నిక నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, క్యాతన్‌పల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, సీపీఐ కూటమి 14 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే.

March 6, 2026 / 04:45 PM IST

దొరికితే కఠిన చర్యలు..!

MDK: పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామ శివార్లో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ వాహనాల తనిఖీ చేపట్టారు.అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు సరైన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

March 6, 2026 / 04:44 PM IST

పన్ను వసూళ్ల పురోగతిని పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ల పురోగతిని ఎంపీడీవో ఇమ్రాన్ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సంబంధించి ఆదాయ వనరులను సమయానికి వసూలు చేసి, పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

March 6, 2026 / 04:43 PM IST

రేపాల లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వసంతోత్సవ (గాంధోలి) వేడుకల్లో ఇవాళ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆలయానికి చేరుకున్న మల్లయ్య యాదవ్‌ను అర్చకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

March 6, 2026 / 04:42 PM IST

రూ.31 కోట్లతో నయనతార దంపతుల కొత్త నివాసం

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార – విఘ్నేష్ చెన్నైలోని ప్రతిష్టాత్మక పోయెస్ గార్డెన్‌లో రూ. 31.5 కోట్ల విలువైన లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. సుమారు 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో 8 కార్ పార్కింగ్ స్లాట్లు ఉండటం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి దిగ్గజాలు నివసించే ఈ ప్రాంతంలోని ప్రాపర్టీలో.. నయనతారకు 90% వాటా ఉండటం గమనార్హం.

March 6, 2026 / 04:42 PM IST

జిల్లా వాసికి ఓయూ డాక్టరేట్ పట్టా

MBNR: మహమ్మదాబాద్ మండలం జెగ్గంపల్లికి చెందిన టంకర్ బాబు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హిందీ విభాగంలో పీహెచ్డీ (డాక్టరేట్) సాధించారు. ప్రొఫెసర్ చంద్రముఖర్జీ పర్యవేక్షణలో భగవాన్ దాస్ మోర్వాల్ సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనకు ఈ పట్టా లభించింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఈ ఉన్నత శిఖరాన్ని చేరుకోవడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

March 6, 2026 / 04:40 PM IST

అనంతపురంలో పోలీస్ ఓపెన్ హౌస్

అనంతపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఇవాళ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా దీనిని నిర్వహించారు. పోలీసులు నిత్యం ఉపయోగించే ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, డ్రోన్ కెమెరాలు, బాంబ్ డిటెక్టర్ల పనితీరును విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

March 6, 2026 / 04:40 PM IST

చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. టీమిండియా ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 198 పరుగులకే ఆలౌటైంది. జెమిమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34) పర్వాలేదనిపించారు. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి (4), హర్మన్‌ప్రీత్ (19), దీప్తి (7) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4, హామిల్టన్ 3, డార్సీ బ్రౌన్ 2 వికెట్లు పడగొట్టారు.

March 6, 2026 / 04:37 PM IST

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

కర్నూలు: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసి, వాటి వినియోగం, ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు.

March 6, 2026 / 04:36 PM IST