TG: మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి ఛైర్మన్ ఎన్నిక 3 వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలు జరిగి నెలరోజులు అవుతున్నా.. ఛైర్మన్ ఎన్నిక నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ కూటమి 14 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే.