• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు.

March 5, 2026 / 05:15 PM IST

ప్రముఖ నటుడు సోనుసూద్ ను కలిసిన మిథున్ రెడ్డి

MBNR: ప్రముఖ నటుడు, సామాజికవేత్త సోను సూద్‌ను MLA, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు మిథున్ వెల్లడించారు. సామాజిక సేవ కార్యక్రమాలపై ప్రత్యేకంగా సోనుసూద్‌ను అభినందించినట్లు మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

March 5, 2026 / 05:15 PM IST

స్వర్ణాంధ్ర క్యాలండర్ ఆవిష్కరించిన కలెక్టర్

VZM: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 క్యాలండర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. వాటిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ పి.గోవిందరాజులు, వివిధ శాఖల అధికారులు అత్యధికంగా పాల్గొన్నారు.

March 5, 2026 / 05:13 PM IST

100 శాతం లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్

GDWL: అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ఏప్రిల్ 14 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం పోషకాహార పంపిణీ జరగాలని, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.

March 5, 2026 / 05:13 PM IST

‘విద్యాశాఖ సమస్యలు పరిష్కరించాలి’

KRNL: కర్నూలు జిల్లాలో విద్యా శాఖలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన సేన సమితి డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర ఆధ్వర్యంలో డీఈవో సుధాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల భవనాల మరమ్మతులు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, తాగునీరు-మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాస్టల్ వసతుల మెరుగుదలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 5, 2026 / 05:12 PM IST

అనంతపురంలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

ATP: జిల్లాలో గురువారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బయాలజీ, మ్యాథ్స్, జూలజీ సబ్జెక్టులకు జరిగిన ఈ పరీక్షల్లో జనరల్ విభాగంలో 5,277 మంది, ఒకేషనల్ విభాగంలో 2,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 383 మంది గైర్హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు.

March 5, 2026 / 05:12 PM IST

విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఈవో

AKP: ఎస్ రాయవరం మండలం ఉప్పరాపల్లి గ్రామంలో మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ కలాం విజ్ఞాన కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. గ్రామ ఎంప్లాయిస్ యూనియన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని ప్రయోజకులు కావాలని సూచించారు.

March 5, 2026 / 05:11 PM IST

నా ఆరోగ్యం బాగానే ఉంది: హోంమంత్రి

AP: హోంమంత్రి అనిత తన ఆరోగ్యంపై స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కొద్దిపాటి అలసట కారణంగా చిన్న ఇబ్బంది కలిగిందని అన్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు.

March 5, 2026 / 05:11 PM IST

ఆరోగ్య మిషన్-99ను విజయవంతం చేయాలి

NGKL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే ‘ఆరోగ్య మిషన్-99’ కార్యక్రమాన్ని పక్కగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ DMHO డా. కె. రవికుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మార్చి 31 వరకు అన్ని PHCల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 5, 2026 / 05:10 PM IST

గ్రామపంచాయతీని ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ

W.G: పెంటపాడు మండలం ఆకుతీగలపాడు గ్రామ పంచాయితీని జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో రైతులకు పంపిణీ చేయవలసిన పట్టాదారు పాసు పుస్తకములలో ఉన్న వివరాలను స్వయంగా పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న భూమి వివరాలు, రీ సర్వే డేటా, ఆధార్ సీడింగ్, పంటల నమోదు, వారసత్వ మార్పులు వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

March 5, 2026 / 05:10 PM IST

రైతులకు యూరియా యాప్ తిప్పలు

NGKL: జిల్లా వ్యాప్తంగా ఎరువుల కోసం బుకింగ్ వ్యవస్థ రైతుల పాలిట శాపంగా మారుతోంది. యాప్‌లో సాంకేతిక లోపాలు, నిమిషాల్లో అయిపోతున్న స్టాక్ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు తమకు కావాల్సిన యూరియాను యాప్‌లో బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే, టెక్నికల్ ఎర్రర్, సర్వర్ బిజీ అని వస్తూ బుకింగ్ ఫెయిల్ అవుతోంది.

March 5, 2026 / 05:10 PM IST

బాధితుడి వద్దకే వెళ్లి FIR నమోదు చేసిన పోలీసులు

MHBD: పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని స్థితిలో ఉన్న బాధితుడి వద్దకే వెళ్లి FIR నమోదు చేసిన ఘటన బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బయ్యారం గ్రామానికి చెందిన రాయల సతీష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఎస్సై తిరుపతి స్వయంగా వెళ్లి బాధితుడిని పరామర్శించి, అతని నుండి ఫిర్యాదును స్వీకరించి ఆన్ -సైట్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఈ కేసును BNS చట్టంలోని నమోదు చేశారు.

March 5, 2026 / 05:10 PM IST

‘మరగ కాచిన నూనె మళ్ళీ వాడద్దు’

KDP: ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ వాడొద్దని జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారిణి హరిత వ్యాపారులను హెచ్చరించారు. గురువారం పొద్దుటూరులోని హోటళ్లు,రెస్టారెంట్ల నిర్వాహకులతో వంట నూనె వినియోగంపై సమావేశం నిర్వహించారు.మరగ కాచిన నూనెను పునర్వినియోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందన్నారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నేరమని శానిటరీ అధికారి నూర్ బాష హెచ్చరించారు.

March 5, 2026 / 05:10 PM IST

‘చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలి’

MHBD: విద్యాలయాల ద్వారా ఆరోగ్యం, ఉత్తమ విద్య బోధనలు పిల్లలకు అందించాలిని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. బయ్యారం మండలంలోని ఇస్లాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్టాక్,రిజిస్టర్, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు.

March 5, 2026 / 05:10 PM IST

గంపలగూడెంలో పర్యటించిన విద్యాశాఖాధికారి

NTR: గంపలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ ఆకస్మిక తనిఖీ చేసి ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. మోడల్ పరీక్షను పరిశీలించి, 10వ తరగతి 100రోజుల యాక్షన్ ప్లాన్ గురించి ప్రధానోపాధ్యాయులతో చర్చించడం జరిగింది. అనంతరం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం సందర్శించి, అక్కడ విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించారు.

March 5, 2026 / 05:09 PM IST