BDK: బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో–3 పునరుద్ధరించి స్థానిక గిరిజనులతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అలాగే 1/70, పిసా చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.