కృష్ణా: పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరంకిలాకులు సెంటర్ వద్ద సీఐ వై. చిట్టిబాబు, ఎస్ఐ బి. శ్రీను కలిసి వాహనాల తనిఖీలు గురువారం నిర్వహించారు. వాహనాల పత్రాలు, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు.