కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార – విఘ్నేష్ చెన్నైలోని ప్రతిష్టాత్మక పోయెస్ గార్డెన్లో రూ. 31.5 కోట్ల విలువైన లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. సుమారు 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో 8 కార్ పార్కింగ్ స్లాట్లు ఉండటం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి దిగ్గజాలు నివసించే ఈ ప్రాంతంలోని ప్రాపర్టీలో.. నయనతారకు 90% వాటా ఉండటం గమనార్హం.