అనంతపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఇవాళ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా దీనిని నిర్వహించారు. పోలీసులు నిత్యం ఉపయోగించే ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, డ్రోన్ కెమెరాలు, బాంబ్ డిటెక్టర్ల పనితీరును విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, తదితరులు పాల్గొన్నారు.