• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: RDO

E.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లలో ప్రజలు సమర్పించిన 8 అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని RDO ఎం.సుజాత అధికారులు సూచించారు. సోమవారం రాజమండ్రిలోని RDO కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రెవిన్యూ క్లినిక్, PGRSకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలపై విచారణ చేసి పరిష్కరించాలని సూచించారు.

March 2, 2026 / 06:10 PM IST

వార్డు సభ్యులకు ఓరియంటేషన్ శిక్షణ

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఎంపీడీవో గీతాంజలి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. పంచాయతీ చట్టం, నాయకత్వ లక్షణాలు, కార్యదర్శుల విధులపై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

March 2, 2026 / 06:09 PM IST

ఇన్‌స్పైర్ మానక్ అవార్డుకు తలారి కీర్తి

TPT: సత్యవేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని తలారి కీర్తి ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్పైర్ మానాక్ అవార్డుకు ఎంపికయ్యారు. ‘మైక్రో లెదర్’ అనే పర్యావరణ హిత ప్రాజెక్టును సమర్పించడం ద్వారా ఈ గుర్తింపు పొందారు. విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందిస్తూ.. మరిన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు.

March 2, 2026 / 06:08 PM IST

మందుగుండు తయారీ దుకాణాలకు నోటీసులు

PPM: మందుగుండు తయారీదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 28న కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో హోం మినిష్టర్ వి.అనిత ఆదేశాల మేరకు జిల్లాలోని ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలను అగ్నిమాపక శాఖ, బాల కార్మికుల నిర్ములన శాఖ అధికారులు తనిఖీ చేశారు.

March 2, 2026 / 06:08 PM IST

ఎర్రకుంటను మాయం చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 6లో 6.15 గుంటల భూమి ఎర్రగుంట ఉండేదని.. 2019లో కొందరు వెంచర్ యజమానులు రికార్డులను తారుమారు చేసి అనుమతులు పొందారని BC, SC, ST మండల జేఏసీ నాయకులు మధు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట భూమిని సర్వే చేసి అనుమతులు రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలన్నారు.

March 2, 2026 / 06:07 PM IST

BIG BREAKING: బాల్క సుమన్‌కు బెయిల్

TG: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు అయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి చేసిన కేసులో.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం రామకృష్ణపురం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం బాల్క సుమన్ ఆదిలాబాద్ జిల్లా కోర్టులో రిమాండ్‌గా ఉన్నారు. 

March 2, 2026 / 06:07 PM IST

BREAKING: గడువు పొడిగింపు

AP: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్.మోహన్‌రావు వెల్లడించారు. మార్చి 17 వరకు ఆలస్య రుసుము లేకుండా, రూ.1000తో మార్చి 21, రూ.2 వేలతో మార్చి 25, రూ.4 వేలతో మార్చి 30, రూ.10 వేలతో ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 4-6 వరకు తప్పుల సవరించుకోవచ్చని చెప్పారు.

March 2, 2026 / 06:06 PM IST

ఈ ఆలయానికి గ్రహణ దోషం లేదు.. ఎందుకంటే?

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రం గ్రహణం రోజున కూడా తెరిచే ఉంటుంది. రేపు మంగళవారం చంద్రగ్రహణం మధ్యాహ్నం గం. 3.20 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంది. అయినా సరే పాదగయ క్షేత్రం తెరిచే ఉండి కుక్కుటేశ్వర స్వామికి పూజలు యధాతధంగా చేస్తారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఆలయం మండపం వద్ద గ్రహణ సమయంలో బ్రాహ్మణులు జపాలు చేస్తారు.

March 2, 2026 / 06:04 PM IST

ఖాజీపూర్ మల్లన్న కళ్యాణ మహోత్సవం

SDPT: భూంపల్లి-అక్బర్పేట్ మండలం ఖాజీపూర్‌లో శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్వాహకులను అభినందించి, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:04 PM IST

ఇరాన్‌ను హెచ్చరించిన గల్ఫ్ దేశాలు

TG: ఇరాన్ దాడులపై 6 గల్ఫ్ దేశాలు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఇరాన్ దాడులు తక్షణమే ఆపాలని హెచ్చరించాయి. దాడులు ఆపకపోతే తమను తాము రక్షించుకునేందుకు ప్రతిదాడులు తీవ్రంగా చేయాల్సి వస్తుందని తెలిపాయి. ఇరాన్ దాడుల వల్ల ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఉందని పేర్కొన్నాయి.. ఈ మేరకు ఖతార్, సౌదీ, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ ప్రకటన చేశాయి.

March 2, 2026 / 06:03 PM IST

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత

SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గతంలో కరెంట్ షాక్‌‌కు గురై మృతి చెందిన అనుమల మహేందర్ కుటుంబానికి సెస్ వైస్ ఛైర్మన్ దేవరకొండ తిరుపతి రూ.5 లక్షల ఎక్స్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఏఈ, గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:03 PM IST

బేటి బచావో బేటి పడావో పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

KNR: బేటీ బచావో.. బేటి పడావో పథకంలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, PCPNDT Act, చైల్డ్ హెల్ప్ లైన్ పోస్టర్లను ఆవిష్కరించారు.

March 2, 2026 / 06:01 PM IST

సీఎం చంద్రబాబుకు అంగన్‌వాడీల అల్టిమేట్

KDP: అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం సీఎం చంద్రబాబు ఇంటి వద్ద హోలీ జరుపుకుంటామని హెచ్చరించారు. తమ డిమాండ్లు అంగీకరిస్తే చంద్రబాబుతో కలిసి సంతోషంగా హోలీ జరుపుకుంటామని, లేదంటే నిరసన తెలుపుతూ హోలీ జరుపుకుంటామని తెలిపారు. ఈ మేరకు అంగన్‌వాడీల నుంచి ఈ హెచ్చరిక వెలువడింది.

March 2, 2026 / 06:01 PM IST

అంబం(వై)లో శవమై తేలిన అదృశ్యమైన వ్యక్తి

NZB: ఎడపల్లి మండలం అంబం(వై)కి చెందిన డప్పు మహేష్ (40) చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన మహేశ్ తిరిగి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. కాళ్లకు చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు.

March 2, 2026 / 06:00 PM IST

మానవత్వం చాటుకున్న మంత్రి సుభాష్

కోనసీమ: దాక్షారామంలోని నిరుపేద పురోహితుడు కావుటూరి సీతారాంకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. సీతారాం గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన ఆర్థిక, జీవన స్థితిగతులను తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ జీవనం కోసం ప్రతినెల రూ. 10 వేలు సహాయం చేస్తున్నారు.

March 2, 2026 / 06:00 PM IST