GNTR: స్వచ్ఛ సర్వేక్షణ 2025-26లో భాగంగా పొన్నూరు మున్సిపాలిటీలో 31 వార్డులకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. పట్టణానికి ఉన్నత ర్యాంకు సాధించడమే లక్ష్యంగా శనివారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్తో సమన్వయం చేసుకుంటూ వార్డుల్లో పరిశుభ్రత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.