NTR: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కృష్ణానదిలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 35–40 ఏళ్ల వయస్సు కలిగినవాడిగా, ఒంటిపై బనియన్ మాత్రమే ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.