• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకారం

KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా  యాదగిరి సునీల్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సునీల్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

April 9, 2026 / 08:03 AM IST

గోపాలపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే

కోనసీమ: గోపాలపురం గ్రామ దేవత గోకులాంబ అమ్మవారి శతాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఆకుల రామకృష్ణలతో బుధవారం రాత్రి కలిసి పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. MLA మాట్లాడుతూ..గోపాలపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.

April 9, 2026 / 08:03 AM IST

జాబ్ రాలేదని సూసైడ్.. చికిత్స పొందుతూ మృతి

బాపట్ల: సంతమాగులూరు మండలం కుందుర్రుకు చెందిన గుంజి నవీన్ (27) ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కన్నవారి కష్టాలు తీర్చాలనుకున్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ‘సర్కారీ కొలువు’ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం విషం సేవించిన నవీన్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఇవాళ చనిపోయాడు. నూరేళ్ల జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం అందరినీ కలిచివేస్తోంది.

April 9, 2026 / 08:03 AM IST

పనులు పూర్తయిన.. ఓపెన్ కానీ రైల్వే స్టేషన్

SDPT: కొమురవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ పనులు పూర్తయి నెలలు గడుస్తున్న రైల్వే స్టేషను ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిశీలించారు. పోరాటాల ఫలితంగా ఏర్పాటు చేసిన స్టేషన్ బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

April 9, 2026 / 08:03 AM IST

‘డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష’

ADB: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ CI సునీల్ కుమార్ బుధవారం తెలియజేశారు. నిందితులు హర్ష సాయి తేజ, ఎర్రోజివర్ అశోక్, కేంద్ర వెంకటి రెండు నుంచి మూడు రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ JFCM న్యాయమూర్తి భుక్య హుస్సేన్ తీర్పును వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని CI సునీల్ కుమార్ సూచించారు.

April 9, 2026 / 08:02 AM IST

CM దృష్టికి అండర్‌పాస్ ప్రతిపాదన: మంత్రి బీసీ

NDL: గుంటూరులో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ CRIF-సేతు బంధన్ పథకం కింద రూ.98 కోట్లతో నిర్మిస్తున్న 4 లేన్ల ROBను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక నేతలు కోరిన అండర్‌పాస్ ప్రతిపాదనపై అంచనాలు సిద్ధం చేస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

April 9, 2026 / 08:00 AM IST

మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు

JGL: మెట్పల్లి మార్కెట్లో నేడు పసుపు ధరలు ఇలా ఉన్నాయి. క్వింటాల్కు గరిష్ఠంగా కాడి రూ .16,000, గోళ రూ .14,509, చూర రూ. 12,222 పలికాయి. కనిష్ఠ ధరలు రూ.9,100 నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 2,346 క్వింటాళ్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 08:00 AM IST

ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

MBNR: ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జ్యూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ, వసతి, భోజనం కల్పిస్తున్నామని, వయస్సు 19-45 లోపు ఉండాలని, SSC, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 13 లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

April 9, 2026 / 08:00 AM IST

BREAKING: జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక కెమికల్ సాల్వెంట్స్ గోదాంలో మంటలు చెలరేగడంతో, లోపల ఉన్న డ్రమ్ములు రహదారిపైకి ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

April 9, 2026 / 08:00 AM IST

పకడ్బందీగా పదో తరగతి మూల్యాంకనం ఉండాలి: కలెక్టర్

W.G: వీరవాసరం(M)లోని ఎం. ఆర్.కె జెడ్పి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం నిర్వహణ తీరుపై సమగ్రంగా పరిశీలించి, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడి వారికి కల్పించిన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మూల్యాంకన కేంద్రంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు.

April 9, 2026 / 08:00 AM IST

‘సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి’

NLR: సమాజంలో సైబర్ నేరస్తుల మోసాలు ఎక్కువగా ఉన్నాయని అప్రమత్తంగా వ్యవహరించాలని సీతారామపురం ఎస్ఐ శ్రీనివాసులు సూచించారు. సీతారామపురం అల్లిక వీధిలో బుధవారం సాయంత్రం ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

April 9, 2026 / 07:59 AM IST

ఒక వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు

AP: రాష్ట్రంలోని రాయలసీమలో ఎండలు మండిపోతుండగా, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇవాళ కాకినాడ, కోనసీమ, తూ.గో. జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమ జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.

April 9, 2026 / 07:57 AM IST

గుమ్మరేగులలో పోలీసులు పల్లెనిద్ర

KKD: రౌతులపూడి SI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుమ్మరేగులలో బుధవారం రాత్రి “పల్లెనిద్ర” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, గృహహింస వంటి అంశాలపై SI అవగాహన కల్పించారు. మహిళలు సెల్ఫ్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

April 9, 2026 / 07:56 AM IST

‘జన గణన ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి’

KMM: జిల్లాలో జనగణన-2027 ప్రక్రియను పకడ్బందీగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించి వెంటనే పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ప్రతి బ్లాక్‌కు భౌతిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు.

April 9, 2026 / 07:55 AM IST

ఇళ్ల మధ్యలో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

ASR: డుంబ్రిగూడలోని పాడి గ్రామంలో ఇళ్లకు ఆనుకుని తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదానికి దారి తీసే పరిస్థితి నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ సరైన రక్షణ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ విద్యార్థులు, వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

April 9, 2026 / 07:54 AM IST