• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏప్రిల్ 12: చరిత్రలో ఈరోజు

1917: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు వినూమన్కడ్ జననం1997: నటుడు ఆకాష్ పూరీ జననం1962: భారతదేశపు ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం1989: రచయిత ఎక్కిరాల భరద్వాజ మరణం2006: నటుడు రాజ్‌కుమార్ మరణం* అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం

April 12, 2026 / 02:22 AM IST

విషాదం.. ముగ్గురు సజీవదహనం

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, వ్యాన్ ఢీకొని.. నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనాల్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

April 12, 2026 / 01:06 AM IST

15న తిరుపతిలో క్రికెట్ స్టేడియం ప్రారంభం

AP: తిరుపతి గోలవనిగుంటలో శాప్(SAAP) నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ఏప్రిల్ 15న ప్రారంభం కానుంది. సా.4 గంటలకు మంత్రి లోకేష్ ఈ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు మెగా DSC-2025 క్రీడా కోటా అభ్యర్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అభ్యర్థులు అదే రోజు ఉ.9 గంటలకు స్టేడియం వద్ద హాజరుకావాలని అధికారులు సూచించారు.

April 12, 2026 / 12:47 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, బస్సు, వ్యాన్ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 12, 2026 / 12:28 AM IST

తమిళనాడులో కాంగ్రెస్ వ్యూహమిదే: ఉత్తమ్

TG: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం బహుముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. చెన్నైలో నియోజకవర్గ స్థాయి పరిశీలకులతో సమావేశమై ప్రచార ప్రణాళికలపై సమీక్షించారు. DMK పొత్తులో భాగంగా అభ్యర్థుల విజయానికి అవసరమైన మార్గదర్శకాలను ఇచ్చారు. ఇటీవల ఈయనను పార్టీ అధిష్టానం తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా నియమించింది.

April 12, 2026 / 12:11 AM IST

IPL: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘనవిజయం

చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై CSK 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC, నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి పాలైంది.

April 11, 2026 / 11:33 PM IST

ధనిక, పేద దేశాల మధ్య మరింత పెరుగుతున్న అంతరం

ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నట్లు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ సహాయం తగ్గడం, అమెరికా విధిస్తున్న అధిక టారిఫ్‌లు(9%-28% కి పెరుగుదల) ఇందుకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా 25 దేశాలు పేద దేశాలకు ఇచ్చే సాయాన్ని తగ్గించగా, అమెరికా ఏకంగా 59% కోత విధించింది. దీంతో 2030 లక్ష్యాల సాధన సవాలుగా మారింది.

April 11, 2026 / 11:16 PM IST

క్రీడల హబ్‌గా కామారెడ్డి: షబ్బీర్ అలీ

TG: కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రూ. 8కోట్ల 90 లక్షలో ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రన్నింగ్ ట్రాక్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన గ్యాలరీలు, టెన్నిస్ కోర్టు భవిష్యత్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపడతామన్నారు.

April 11, 2026 / 10:45 PM IST

నిందితులను నడివీధిలో నడిపించిన పోలీసులు

AP: పులివెందులలో అల్లర్లకు పాల్పడిన నిందితులతో పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయించారు. పూల అంగళ్ల కూడలి నుంచి పాత బస్టాండు వరకు వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పాత కక్షలతో జగదీష్ అనే వ్యక్తిపై మద్యం మత్తులో దాడి చేసిన తిరుపాల్, రౌడీషీటర్ విక్రమ్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని DSP మురళీనాయక్ హెచ్చరించారు.

April 11, 2026 / 10:37 PM IST

పార్టీ జెండా రంగు రివీల్ చేసిన కవిత!

TG: కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ జెండా, ఎజెండాలో నీలి రంగు ప్రధానంగా ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. నీలం రంగు నమ్మకత్వానికి, బడుగు బలహీన వర్గాల వికాసానికి చిహ్నమని పేర్కొన్నారు. ఈనెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో పార్టీని ప్రకటించనున్నారు. ‘సామాజిక తెలంగాణ-సర్వోదయ వికాసం’ ఎజెండాగా, ‘తెలంగాణ ఫస్ట్’ సిద్ధాంతంతో ఈ పార్టీ ముందుకు సాగనుంది.

April 11, 2026 / 10:24 PM IST

అంబేద్కర్ ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం

MLG: ఏటూరునాగారంలో నిర్వహించబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ వీ.ప్రకాష్‌కు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కాసేపు ఆయనతో వారు చర్చించారు. నాయకులు శ్రీనివాస్, అన్నమయ్య, సంతోష్ తదితరులు ఉన్నారు.

April 11, 2026 / 10:11 PM IST

తాండూరు BRS ఇంఛార్జ్‌గా శ్రీశైలంరెడ్డి నియామకం

VKB: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో తాండూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం రెడ్డి పంజుగుల నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ప్రకటన చేశారు.

April 11, 2026 / 10:08 PM IST

CSK vs DC: ఢిల్లీకి డబుల్ షాక్

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి డబుల్ షాక్ తగిలింది. ఖలీల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (18) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే నిశాంక (41) పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసేరికి ఢిల్లీ స్కోర్ 66/2గా ఉంది. ఢిల్లీ విజయానికి 84 బంతుల్లో 147 పరుగులు అవసరం.

April 11, 2026 / 10:03 PM IST

ఆసుపత్రి వార్డు తనిఖీ చేసిన సూపరింటెండెంట్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు AMC వార్డును తనిఖీ చేశారు. ఎలక్ట్రికల్ పనులు, ఆక్సిజన్ ప్యానెల్ బోర్డుల అమరికను పరిశీలించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించి సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

April 11, 2026 / 10:00 PM IST

111 మంది రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన కలెక్టర్

NDL: జిల్లాలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములు, 22ఏ-1 నిషేధిత జాబితా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ 111 మంది రైతులకు డీ-నోటిఫికేషన్ క్లియరెన్స్ పత్రాలను అందజేసినట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు ఈ పత్రాలను పంపిణీ చేశారు 150 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. 111 పరిష్కరించామన్నారు.

April 11, 2026 / 10:00 PM IST