VKB: వికారాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న కెమెరాలు మెయింటినెన్స్ లేక, మరమ్మతులకు గురై నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషించాల్సిన నిఘా నేత్రాలను అధికారులు గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.