NLG: డిండి మండలంలోని ఎర్రారం గ్రామంలో విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సీమర్ల కృష్ణయ్యకు చెందిన ఎద్దు పొలంలో మేస్తుండగా, ఒక్కసారిగా ఎల్టీ వైరు తెగి దానిపై పడింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని రైతు వేడుకున్నాడు.