ADB: రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి గురువారం తెలిపారు. పట్టణంలోని స్టేషన్ రోడ్డుకు చెందిన వ్యాపారి అస్లాం పారిక్పై దాడి చేసిన ఘటనలో 8 మందిపై కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులు నహీద్, అక్బర్, ముస్తఫా, ఉజైర్, రేహాన్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.