WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని అల్లూరి కాలనీలో ఇంటి ముందు క్షుద్రపూజలు నిర్వహించిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం తుంగ రవిందర్ ఇంటి ముందు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.