KMM: పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అమరుల త్యాగాలను అవమానించడమేనని ఆక్షేపించారు. రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీకి ఉన్న కుటిల బుద్ధి బయటపడిందని, తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.