నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET)-2026కి సంబంధించిన అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ను నమోదు చేసి అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు కాపీని భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలను ఏప్రిల్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది.