HYD: ధర్నా చౌక్‌లో ఈనెల 18న తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే “న్యాయ్ కిసాన్” వాల్ పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఆవిష్కరించారు. ఈ ధర్నాలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్యాం సుందర్ రెడ్డి, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.