KMR: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 18న ఉ.10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి రజిని కిరణ్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పని చేసేందుకు ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన 18-35 ఏళ్ల వారు అర్హులని చెప్పారు. వేతనం రూ.18 వేలతో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు రెండు సెట్ల సర్టిఫికెట్లు, ఆధార్, బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.