NZB: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్వో బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.