KNR: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో కరీంనగర్ నుంచి జన సమీకరణకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గ ముఖ్య నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రవాణా, భోజన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని అన్నారు.