VZM: దేశాభివృద్ధిలోను, సంక్షేమ పథకాల రూపకల్పనలోను జనగణన ప్రక్రియ అత్యంత కీలకమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఆమె ‘జనగణన’ కార్యక్రమాన్ని గురువారం అధికారికంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో సమక్షంలో ఆమె తన వివరాలను ఆన్లైన్ ద్వారా ‘సెల్ఫ్ ఎన్రోల్మెంట్’ చేసుకున్నారు.