BPT: కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, 108 వాహనాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావు పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యాజలి, పేరలి, చింతాయపాలెం, గణపవరం గ్రామాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
AKP: జనగణన ప్రక్రియలో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం మండలం మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్వీయ గణన చేసుకున్నారు. గృహ గణనకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో అడిగిన వివరాలను నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి గృహ గణన ప్రారంభం అయిందని అన్నారు.
SKLM: అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా ఆమదాలవలస పట్టణం మెట్టక్కివలసలో గురువారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో వివరించడంతో పాటు, వాటిని అరికట్టే పద్ధతులను ప్రదర్శించారు. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.
ఐపీఎంలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (JIPMAT) – 2026 నోటిఫికేషన్‌ను NTA విడుదల చేసింది. ఇంటర్‌తో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇండిగ్రేటెడ్ MBA కోర్సులో చేరవచ్చు. అభ్యర్థులు మే 11వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 7న పరీక్ష నిర్వహిస్తారు.
విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. భారత జనగణన 2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ఆయన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ఎంతో సులభమన్నారు.
SKLM: సోంపేట ఎక్సైజ్ సీఐ జీ.వి. రమణ ఆధ్వర్యంలో కాకర్లపుట్టుగ, బురదపాడు ప్రాంతాల్లో నాటు సారా రవాణా, విక్రయాలపై దాడులు నిర్వహించారు. 200 ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఒడిశా నుంచి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
SDPT: ప్రజలందరూ వాహనం నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే సురక్షితంగా ఉండగలుగుతామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇవాళ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారం మండలంలో నిర్వహించిన అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
VKB: కుల్కచర్లలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు అన్నారు. రైతు వేదికలో గురువారం నిర్వహించిన ‘ప్రగతిబాట ప్రజాపాలన’ కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
GDWL: జిల్లాలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత 43.7° సెల్సియస్ నమోదైంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వడదెబ్బ నివారణకు తగినంత నీరు తాగాలని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
AP: విశాఖ శాంతికుమారి మృతి వివరాలను ఏసీపీ నరసింహమూర్తి వెల్లడించారు. మిత్రులతో పుట్టినరోజు పార్టీకి శాంతికుమారి హాజరైంది. తర్వాత మిత్రుల మధ్య గొడవ జరిగింది. శాంతిపై మిగతా స్నేహితులు దాడి చేశారు. మిత్రులు కొట్టారనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఐదుగురు యువకులు, యువతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం’ అని వివరించారు.
MDCL: అల్వాల్‌లోని లయోల అకాడమీ ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ‘మెలాంజ్ 2026’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ‘మెటామార్ఫోసిస్’ థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బద్రుక ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ అభిరామ్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
TPT: శ్రీకాళహస్తిలో నారీశక్తి వందన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళా సాధికారతకు నిదర్శనమని వారు కొనియాడారు. మహిళలకు నిర్ణయాధికారం, సమాన గౌరవం కల్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
TG: పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, TG అస్థిత్వంపై ఆ పార్టీ నేతలకు గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడటాన్ని భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం దారుణమన్నారు. BJP నాయకులు పదేపదే TG ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. BJP చేస్తున్న వ్యాఖ్యలను TG సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24న ‘వనిత వేవ్ 100’ శతాబ్ది వాక్ నిర్వహించనున్నారు. బీచ్ రోడ్‌లోని కాళీమాత మందిరం వద్ద ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ విడుదల చేశారు.
NDL: వేల్పనూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఆత్మకూరు బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఇవాళ ఎమ్మెల్యే స్వగృహంలో ప్రెసిడెంట్ బోల్లు నగేష్,సెక్రటరీ సుదర్శన్, వైస్ ప్రెసిడెంట్ నూర్ అహమ్మద్ కలిసి సత్కరించారు. ఆత్మకూరులో కొత్తగా ఏర్పాటు కాబోతున్న అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ,శిధిలావస్థలో ఉన్న కోర్టు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు.