కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు రఘునాథ్, షాహిద్, ఆఫ్రిద్ డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయులను ఆయన వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా గేదెకు వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ELR: ద్వారకాతిరుమలలో పోలీసు సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్ నేడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం క్వార్టర్స్‌లో ఎవరు లేకపోవడంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్వార్టర్స్ నిరుపయోగంగా మారడంతో విషపురుగుల సంచరించే అవకాశం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి క్వార్టర్స్ పునరుద్ధరించాలని కోరారు.
జగిత్యాల రూరల్ మండలంలోని రఘురాములకోట గ్రామంలో గర్భిణి మధురకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకోగా, నొప్పులు అధికం కావడంతో, పరిస్థితిని గమనించిన 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇంటి వద్దనే పురుడు పోశారు. మధుర పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు.
PDPL: జూలపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో NCD ఔట్ రీచ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో గ్రామస్థులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
KNR: నగర ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే పాలకవర్గ ధ్యేయమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం 48వ డివిజన్లో రూ.10 లక్షల వ్యయంతో పైపులైన్ పనులకు ఆయన భూమిపూజ చేశారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్య మిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టామని, మానేరు డ్యాంలో 10 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చూస్తామన్నారు.
NRML: మే 13వ తేదీన నిర్వహించనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిప్లమో కోర్సుకు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు.
MNCL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నెన్నెల మండల తహసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మైలారం గ్రామానికి లబ్ధిదారురాలు కొయ్యడ ఉమారాణికి మంజూరైన కల్యాణ లక్ష్మి పథకం చెక్కును గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గట్టు మల్లేష్, AMC డైరెక్టర్ గోలేటి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఏపీలో జరుగుతున్న స్వీయ జనగణనలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన గణాంకాలు భవిష్యత్తు ప్రణాళికలకు పునాది వంటివని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని పౌరులందరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.
ADB: అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీ డా. అనిల్ కుమార్ గురువారం ఆదిలాబాద్‌కు వచ్చారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ మౌనిక, డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు ఉన్నారు.
NLR: దేశ వ్యాప్తంగా జనగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కందుకూరు R&B గెస్ట్ హౌస్లో గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. DRO ఓబులేసు మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు స్వీయ గణన కొనసాగుతుందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.
ADB: అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీ డా. అనిల్ కుమార్ గురువారం ఆదిలాబాద్‌కు వచ్చారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ మౌనిక, డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు ఉన్నారు.
SRCL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’లో భాగంగా గురువారం ఇల్లంతకుంటలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. కలెక్టర్ కరీమా అగర్వాల్ స్వయంగా హాజరై రేషన్ డీలర్ల ద్వారా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.
ఎన్టీఆర్: గుంటూరులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను, నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వర కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియమితులైన సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
NLG: మిర్యాలగూడ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి మాధవి ప్రారంభించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పట్టణానికి వచ్చే రైతులకు, సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం సుమారు 3,000 మందికి ఈ అన్నదానం నిర్వహిస్తున్నారు.
MHBD: తొర్రూరు పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ సేవలపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ల సరఫరా సకాలంలో జరగకపోవడంతో తొర్రూరు పట్టణం, పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఇప్పటి వరకు సిలిండర్లు అందలేదని, పలుమార్లు ఫోన్ చేసిన ఫలితం లేదని బాధితులు మండిపడుతున్నారు.