TG: కామారెడ్డి జిల్లా గొల్లవాడలో ఐఫోన్ పేరిట రూ.1.05 లక్షల లూటీ జరిగింది. జాహెద్ అనే వ్యక్తి ఐఫోన్ కొనాలని ఆన్లైన్లో వెతికాడు. నిందితుడు జాహెద్‌కు ఫోన్ చేసి ఐఫోన్ ధర చెప్పి నగదు బదిలీ చేయాలన్నాడు. దీంతో రూ.1.05 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
VSP: విశాఖలోని వెంకోజీపాలెం బస్టాప్ వెనుక సాయిబాబా గుడి సమీప కాలువ చెత్తతో నిండిపోగా దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారు ఈగలు, దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లేకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
NTR: వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొండపై ఉన్న క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న పల్లకీ సేవ ప్రాంతంలో శంకరాచార్య స్వామి విగ్రహానికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం భక్తులు పూజలు చేశారు.
SRPT: నాగారం మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శోభారాణిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మార్వో దేవేంద్ర ప్రసాద్ తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఏడాది కాలంగా ఫైల్స్‌ను క్లియర్ చేయడంలో అలసత్వంపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.
CTR: రొంపిచర్ల జడ్పీ బాయ్స్ హై స్కూల్‌కి చెందిన టీచర్లు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఫజులుపేటలో ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించమని ఉపాధ్యాయులు అడుగుతున్నారు. పాఠశాలలో విద్యాపరంగా ఎదుగుదలకు ఉన్న వసతుల గురించి వివరిస్తూ పిల్లల నమోదుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో HM ధనలక్ష్మి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
VKB: అప్పాయిపల్లి, రుద్రారం గ్రామాల్లో టీబీ ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా ఉచిత ఎక్స్‌రే నిర్వహించారు. ఎక్స్‌రే తీయగా 20 మందికి అబ్‌నార్మల్ వచ్చినట్లు తెలిపారు. టీబీని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ DMHO, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డా.రవీందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డా. బుప్రా ఫాతిమా, అమృత, పకీరప్ప, మధుసుదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KRNL: కేంద్ర ప్రభుత్వం 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందించే పద్మ పురస్కారాలు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారు, పాల్గొన్న వారు అర్హులని చెప్పారు. దరఖాస్తు ఫామ్‌లు https://awards.gov.inలో లభిస్తాయని, మే 15లోపు ఆ వివరాలను తమకు అందజేయాలని ఆయన సూచించారు.
ELR: సెల్ఫ్ ఎన్యూమరేషన్’ స్వయం నమోదు దశ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. సెన్సస్ అధికారులమంటూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు పంపి ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందన్నారు. జనగణన పేరుతో ఎవరైనా మీ బ్యాంక్ వివరాలు లేదా OTP అడిగితే ఇవ్వొద్దని అన్నారు.
ప్రకాశం: ఉలవపాడు మండలంలోని రాజుపాలెం సమీపంలో మంగళవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని చిరు వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిపాడు మండలానికి చెందిన శేషయ్య మామిడి పండ్లు గంపని ఎత్తుకుని రోడ్డు దాటుతున్న సమయంలో బస్సు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా శేషయ్య అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేతా బాధ్యతలను స్వీకరించారు. అనిత్ చంద్ర 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతనెల 31తో ప్రస్తుత ఎస్ఈసీ నీలంసాహ్ని పదవీకాలం ముగిసింది. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న పునేతాను ఎస్ఈసీగా నియమించారు.
HYD: బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే వేద పండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించి, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. మంగళవారం కావడంతో నగరవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు.
షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘కింగ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ సెన్సేషనల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ ఈ ప్రాజెక్టులోకి వస్తున్నట్లు టాక్. గ్లోబల్ టచ్ ఇచ్చేలా అనిరుధ్ ఈ స్పెషల్ కొలాబరేషన్ సెట్ చేస్తున్నట్లు టాక్. 2026 DECలో ‘కింగ్’ విడుదల కానుంది.
గుంటూరు మిర్చి యార్డ్‌లో ఖాళీ గోనెసంచి ధరను 10 ఏళ్ల తర్వాత పెంచారు. గోతానికి రూ.15 నష్టం భరిస్తున్నామని రైతులు మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియజేయగా, ఆయన జోక్యంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ఏటా సుమారు రూ.30 కోట్ల లాభం రైతులకు దక్కనుంది. తక్కువ ధర ఇస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
సత్యసాయి: మడకశిర మండలం జమ్మానిపల్లి గ్రామంలో ఎంపీపీ పాఠశాలను గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారి భాస్కర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేసుకోవాలని సూచించారు.
KDP: పులివెందులలోని స్థానిక YSVRM ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు అభినందించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ చూపడంతో జిల్లా స్థాయిలో తమ కళాశాలను మొదటి స్థానంలో నిలబెట్టారని తెలిపారు.