BHPL: జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ అనే పేరుతో రోడ్డు భద్రతా పోస్టర్లు రూపొందించారు. ఈ పోస్టర్ల ద్వారా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపవద్దని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం, సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనం నడపవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.