వికారాబాద్ జిల్లాలో ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజును ‘చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే’గా నిర్వహించి, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పాఠశాలల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.