TG: చారిత్రక కట్టడాల సంరక్షణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చేతుల్లోకి హైదరాబాద్ కుతుబ్ షాహీ టూంబ్స్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సంస్థకు ఉన్న అనుభవం నేపథ్యంలో నిర్వహణను దీనికి అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమాధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ర్ట పర్యాటక శాఖ ప్రయత్నిస్తోంది.